ఇవాళ విడుదలైన హృతిక్ రోషన్ ఫైటర్ టీజర్ కు మంచి స్పందనే కనిపిస్తోంది. స్పై డ్రామాలతో బోర్ కొట్టేసిన బాలీవుడ్ జనాలకు రిలీఫ్ ఇచ్చేలా ఈసారి దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఆకాశంలో జరిగే విమానాల యుద్ధం కాన్సెప్ట్ ని తీసుకున్నాడు. దానికి దేశభక్తి జోడించి, దీపికా పదుకునేతో హాట్ గ్లామర్ ప్లస్ స్కిన్ షో చేయించేశాడు. ఆన్ లైన్ లో యాక్షన్ విజువల్స్ కన్నా బీచ్ ఒడ్డున హీరో హీరోయిన్ల హాట్ ఫోజు వైరల్ గా మారుతోంది. భారీతనం ఉట్టిపడుతోంది కానీ హాలీవుడ్ క్లాసిక్ మూవీ టాప్ గన్ ఛాయలు స్పష్టంగా కనిపించడం చూస్తే స్ఫూర్తి చెందారేమోననే అనుమానం కలిగిస్తోంది.
ఇంత పెద్ద కాన్వాస్ తో ఫ్లైట్ బ్యాక్ డ్రాప్ లో గత కొన్నేళ్లలో స్టార్ హీరో సినిమా రాలేదు. అందులోనూ హృతిక్ రోషన్ చేస్తుండటంతో అంచనాలు మాములుగా లేవు. వరుణ్ తేజ్ ఇలాంటి కాన్సెప్ట్ తో సోని సంస్థ నిర్మాణంలో ఆపరేషన్ వాలెంటైన్ చేశాడు కానీ డిసెంబర్ 8 విడుదల కావలసిన ఈ ప్యాన్ ఇండియా మూవీ అనుకోకుండా వాయిదా పడింది. ఇందులో కూడా విజువల్స్ కట్టిపడేసేలా ఉంటాయని యూనిట్ అంటోంది కానీ కనీసం టీజర్ వస్తే కానీ క్లారిటీ రాదు. టాప్ గన్ తో పోలిక వరకు బాగానే ఉంది కానీ అంచనాలు అందుకోవడంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఫైటర్ కు ఇబ్బందే.
2025 రిపబ్లిక్ డేని లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఫైటర్ కు మోహన్ లాల్, విక్రమ్ లు పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో చెప్పలేదు. పఠాన్, జవాన్, టైగర్ 3 అన్ని ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేశారు. డంకీకి మాత్రం వద్దనుకున్నారు. యానిమల్ తో మంచి పాత్ర దక్కించుకున్న అనిల్ కపూర్ ఫైటర్ లోనూ కీలకంగా వ్యవహరించబోతున్నాడు. ప్రతి గణతంత్ర దినోత్సవానికి ఒక భారీ చిత్రాన్ని రిలీజ్ చేయడాన్ని సెంటిమెంట్ గా పెట్టుకున్న బాలీవుడ్ కి ఈసారి కాంపిటీషన్ కష్టంగానే ఉంది కానీ హృతిక్ ఏ మేజిక్ చేస్తాడో చూడాలి.
This post was last modified on December 8, 2023 9:43 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…