వచ్చే వారం విడుదల కాబోతున్న హాయ్ నాన్నకు ఒక పెద్ద టెన్షన్ తీరిపోయింది. టాక్ ఎంత డివైడ్ గా ఉన్నా కలెక్షన్లతో అదరగొడుతున్న యానిమల్ పూర్తిగా అడల్ట్ ప్లస్ యూత్ కంటెంట్ తో ఉండటంతో ప్రధానంగా కుటుంబ ప్రేక్షకులనే లక్ష్యంగా పెట్టుకున్న నానికి ఇప్పుడా సమస్య లేదు. రన్బీర్ కపూర్ వయొలెంట్ మాస్ ని పిల్లలతో సహా చూసేందుకు క్లాస్ ఆడియన్స్ అంతగా ఇష్టపడటం లేదని థియేటర్ జనాలను చూస్తే అర్థమైపోతోంది. సో వాళ్లకు బెస్ట్ ఛాయస్ హాయ్ నాన్ననే అవుతుంది. పాప సెంటిమెంట్ తో ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేస్తూ దర్శకుడు శౌర్యువ్ దీన్ని తీర్చిదిద్దారు.
ప్రమోషన్ విషయంలో నాని ఎక్కడా తగ్గడం లేదు. వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో మ్యూజికల్ నైట్ జరగబోతోంది. యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో స్పెషల్ ముఖాముఖీ ఆల్రెడీ వైరల్ అయ్యింది. వెంకటేష్ తో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ షూట్ చేసేశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి నాని ఆల్రెడీ కవర్ చేసి వచ్చాడు. వచ్చే వారాంతంలో అమెరికా వెళ్లి అక్కడి ప్రోగ్రాంస్ లో భాగం కాబోతున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి హీరో నవీన్ తీసుకున్న శ్రద్ధ అద్భుత ఫలితాన్ని ఇవ్వడంతో నానినే కాదు నితిన్ కూడా స్పెషల్ గా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు.
సో హాయ్ నాన్న కనక మంచి టాక్ తెచ్చుకుంటే ఒక రెండు వారాల పాటు ఢోకా ఉండదు. డిసెంబర్ 15 చెప్పుకోదగ్గ రిలీజులు లేవు కాబట్టి అప్పుడు దీంతో పాటు ఎక్స్ ట్రాడినరి మ్యాన్ మాత్రమే ఆప్షన్లుగా ఉంటాయి. డిసెంబర్ 22 సలార్, డంకీలు వచ్చే లోపు నాని, నితిన్ ఇద్దరూ బ్రేక్ ఈవెన్ లు దాటేసి లాభాల్లోకి ప్రవేశించాలి. పధ్నాలుగు రోజులు మంచి స్పాన్ కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లకు ఎలాంటి లోటు ఉండదు. మృణాల్ ఠాకూర్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. హేశం అబ్దుల్ వహాబ్ పాటలు మ్యూజిక్ లవర్స్ కి కనెక్ట్ అయిపోయాయి. యానిమల్ ఇప్పుడెంత దూకుడుగా ఉన్నా రెండో వారంలో నెమ్మదించడం ఖాయమే.
This post was last modified on December 2, 2023 11:22 pm
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…