లియో వస్తోంది భగవంతే బ్యాలన్స్

పెద్ద సినిమాలు థియేటర్ లో వచ్చినప్పుడు ఎంత సందడి చేస్తాయో ఓటిటి రిలీజ్ కావడం కోసం కూడా అభిమానులు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తారు. దసరాకు అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మొన్న శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ మొదలుపెట్టగా తాజాగా లియోని ఈ నెల 24 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్టు నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇండియాకు ఆ డేట్ కాగా గ్లోబల్ గా 28 నుంచి విదేశాల ప్రేక్షకులు చూసుకోవచ్చు. జైలర్ ను దాటేస్తుందేమోనన్న రేంజ్ లో హడావిడి చేసిన లియో తమిళ వెర్షన్ నుంచే సింహభాగం వసూళ్లను నమోదు చేసుకుంది.

ఇక బ్యాలన్స్ ఉన్నది భగవంత్ కేసరి ఒక్కటే. బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అయిదో వారంలో అడుగు పెట్టాక కూడా ప్రధాన కేంద్రాల్లో ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది. దీని తర్వాత వచ్చినవేవి పెద్దగా మెప్పించలేకపోవడంతో వీకెండ్ వసూళ్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ దాటేసి ఎప్పుడో లాభాలు వచ్చేయడంతో ఇదంతా బయ్యర్లు బోనస్ గానే ఫీలవుతున్నారు. కొన్ని చోట్ల స్కూల్ పిల్లలకు ప్రత్యేక షోలు వేయడం ద్వారా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సందేశాన్ని మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తన్నారు.

భగవంత్ కేసరి హక్కులు ప్రైమ్ తీసుకుంది. ఈ వారం పది రోజుల్లోనే డిజిటల్ ఎంట్రీ  అవకాశముంది. నాలుగు వారాలు లేదా ఆరు వారాల మధ్య అధిక శాతం సినిమాలు ఓటిటి అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇంత కన్నా ఆలస్యం ఉండకపోవచ్చు. వరసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు నమోదు చేసుకున్న బాలయ్య ప్రస్తుతం బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి హిందీ డబ్బింగ్ తనే స్వయంగా చెబుతున్న సంగతి పంచుకున్న బాలకృష్ణ మరి ఆ అవకాశాన్ని డైరెక్ట్ గా ఓటిటిలో వినిపిస్తారో లేక ప్రత్యేకంగా నార్త్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటారో వేచి చూడాలి.