స్టార్ యాంకర్ సుమ ఇవాళ జరిగిన ఆదికేశవ ప్రెస్ మీట్ లో ఈవెంట్ ప్రారంభానికి ముందు కొందరు కెమెరామెన్లను ఉద్దేశించి అన్న మాటలు మీడియా వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీశాయి. బయట స్నాక్స్ తింటున్న వాళ్ళు వాటిని భోజనంలా కాకుండా త్వరగా తిని రావాలని ఈ విషయాన్ని మరో ముగ్గురికి చెప్పాలని వ్యంగ్యంగా చెప్పడంతో కొందరు ఆ మాటల పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగిపోయాయి,. వేదిక మీద అప్పటికప్పుడు సుమ ఏదో సరిచెప్పే ప్రయత్నం చేసింది కానీ అదంత కన్విసింగ్ గా లేకపోయినా మిగిలిన ప్రోగ్రాం జరిగింది.
దీని మీద ట్విట్టర్ లో పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరికి సుమ ఒక వీడియో మెసేజ్ ద్వారా తన మాటలు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించాలని, ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కలిసి పని చేశాం కాబట్టి అర్థం చేసుకోవాలని కోరుతూ సారీ చెప్పింది. ఇక్కడితో ఈ ఇష్యూకి చెక్ పడినట్టే అనుకోవాలి. నిజానికి సుమ స్లిప్ అయ్యిందనే చెప్పాలి. ప్రోగ్రాం దగ్గర స్నాక్స్ ఏర్పాటు చేసినప్పుడు సహజంగా ఎవరైనా వాటిని తీసుకుని వస్తారు. ఇక్కడ చిన్నా పెద్ద తేడా ఏమి ఉండదు. వచ్చిందే అటెండ్ కావడానికి అయినప్పుడు అదే పనిగా తిండి మీద ధ్యాస పెట్టడం లాంటివి ఉండవు.
ఏదైతేనేం సుమ ఫైనల్ గా క్షమాపణ చెప్పడం మంచిదే అయ్యింది. ఇంటర్ నెట్ ప్రపంచంలో ప్రతిదీ వీడియో రూపంలో చక్కర్లు కొట్టడం సహజమైపోయింది. అలాంటప్పుడు తమాషాకి అన్నా, ఏ ఉద్దేశంతో ఏదైనా మాట్లాడినా దాని ప్రభావం ఒక్కోసారి చాలా దూరం వెళ్ళిపోతుంది. మాములుగా సుమ వివాదాలకు దూరంగా ఉంటుంది. కానీ ఇలా అత్యుత్సాహంతో మీడియా మీద జోకులు వేయడాన్ని మాత్రం ఎవరూ సమర్ధించరు. ఇప్పుడీ టాపిక్ వల్లే అంతగా ఫోకస్ లో లేని ఆదికేశవ పాట గురించి జనాలకు తెలిసిపోయింది. అనుకోకుండా జరిగినా కొన్నింటి పుణ్యాలు పురుషార్ధాలు ఈ రకంగా నెరవేరతాయి.