లియో ఫస్ట్ హాఫ్ లో ప్రధానంగా చెప్పుకునే హైలైట్స్ లో విజయ్ పోషించిన పార్తీబన్ పాత్ర తన కాఫీ షాప్ లో సృష్టించే నరమేథం. రౌడీ గ్యాంగ్ లో సైకో ఒకడు వచ్చి అర్ధరాత్రి చాకొలేట్ కాఫీ అడగటమే కాకుండా రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయిని దగ్గరకు తీసుకుని వేధించబోతాడు. అక్కడితో ఆగకుండా హీరో కూతురిని టార్గెట్ చేయడంతో విజయ్ గన్ను తీసుకుని ఎడాపెడా ముఠాని మొత్తం పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కణితిలో బులెట్ దిగేలా కాల్చి పారేస్తాడు. అప్పటిదాకా శాంతమూర్తిలా కనిపించిన విజయ్ ఒక్కసారిగా వయొలెంట్ గా మారిపోవడం థియేటర్లో ఓ రేంజ్ లో పేలింది.
దీనికి జగపతిబాబుకి కనెక్షన్ ఏంటని డౌటా. అక్కడికే వద్దాం. 2010లో వచ్చిన గాయం 2లో అచ్చం ఇదే ఎపిసోడ్ ఉంటుంది. హోటల్ లో తనతో పాటు హర్షవర్ధన్ పని చేసుకుంటూ ఉండగా షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఇద్దరు గూండాలు వస్తారు. మూశామని చెప్పినా సరే కాఫీ డిమాండ్ చేస్తారు. అయినా సరే ప్రశాంతంగా తయారు చేసి ఇచ్చేలోపు వాళ్లలో ఒకడు అమ్మాయిని దగ్గరికి తీసుకుని ఇబ్బంది పెడతాడు. దీంతో పెనుగులాట మొదలై జగ్గు భాయ్ ఇద్దరినీ పిస్టల్ తో లేపి పారేసి షాక్ తిన్న ఎక్స్ ప్రెషన్ తో కుప్పకూలిపోతాడు. లియోకి ఈ సీన్ కి ఎంత సారూప్యం ఉందో మళ్ళీ చెప్పనక్కర్లేదు.
2005లో హిస్టరీ అఫ్ వయొలెన్స్ ని స్ఫూర్తిగా తీసుకుని లియో రాసుకున్నానని దర్శకుడు లోకేష్ కనగరాజ్ టైటిల్ కార్డులోనే ఒప్పేసుకున్నాడు. గాయం 2 కూడా దాని నుంచి ఇన్స్ పిరేషన్ తీసుకున్నదే. కాకపోతే మొత్తం కథ కాకుండా సగం వాడుకుని సెకండ్ హాఫ్ లో గాయం మొదటి భాగం తాలూకు ట్విస్టులను వాడుకున్నారు. కానీ అవి సరైన రీతిలో పండకపోవడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడీ జగపతిబాబు వీడియోని నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. లోకేష్ కాపీ కొట్టాడని, తెలుగులో ఎప్పుడో తీశారని రెండింటి పోలికలను బట్టబయలు చేస్తున్నారు. ఇలాంటి టాపిక్స్ దొరకాలే కానీజనం మాములుగా చెలరేగిపోరు.
This post was last modified on October 23, 2023 12:25 am
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్…
తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై అన్ని వర్గాలు స్పందించాయి. రాజకీయ వర్గాల నుంచి పారిశ్రామిక వర్గాల…
నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తండేల్ రాజ్ ని పుష్పరాజ్ కలుసుకోవడాన్ని చూసి ఆనందిద్దామని ఎదురు చూసిన…
వైసీపీ అధినేత జగన్ తన బ్రిటన్ పర్యటన ముగించుకుని చాలా రోజుల తర్వాత ఏపీకి వస్తున్నారు. వాస్తవానికి ఆయన నాలుగు…
వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…
పియర్ పండు, లేదా బేరిపండు, రుచిలో మధురమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పండు…