లియో ఫస్ట్ హాఫ్ లో ప్రధానంగా చెప్పుకునే హైలైట్స్ లో విజయ్ పోషించిన పార్తీబన్ పాత్ర తన కాఫీ షాప్ లో సృష్టించే నరమేథం. రౌడీ గ్యాంగ్ లో సైకో ఒకడు వచ్చి అర్ధరాత్రి చాకొలేట్ కాఫీ అడగటమే కాకుండా రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయిని దగ్గరకు తీసుకుని వేధించబోతాడు. అక్కడితో ఆగకుండా హీరో కూతురిని టార్గెట్ చేయడంతో విజయ్ గన్ను తీసుకుని ఎడాపెడా ముఠాని మొత్తం పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కణితిలో బులెట్ దిగేలా కాల్చి పారేస్తాడు. అప్పటిదాకా శాంతమూర్తిలా కనిపించిన విజయ్ ఒక్కసారిగా వయొలెంట్ గా మారిపోవడం థియేటర్లో ఓ రేంజ్ లో పేలింది.
దీనికి జగపతిబాబుకి కనెక్షన్ ఏంటని డౌటా. అక్కడికే వద్దాం. 2010లో వచ్చిన గాయం 2లో అచ్చం ఇదే ఎపిసోడ్ ఉంటుంది. హోటల్ లో తనతో పాటు హర్షవర్ధన్ పని చేసుకుంటూ ఉండగా షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఇద్దరు గూండాలు వస్తారు. మూశామని చెప్పినా సరే కాఫీ డిమాండ్ చేస్తారు. అయినా సరే ప్రశాంతంగా తయారు చేసి ఇచ్చేలోపు వాళ్లలో ఒకడు అమ్మాయిని దగ్గరికి తీసుకుని ఇబ్బంది పెడతాడు. దీంతో పెనుగులాట మొదలై జగ్గు భాయ్ ఇద్దరినీ పిస్టల్ తో లేపి పారేసి షాక్ తిన్న ఎక్స్ ప్రెషన్ తో కుప్పకూలిపోతాడు. లియోకి ఈ సీన్ కి ఎంత సారూప్యం ఉందో మళ్ళీ చెప్పనక్కర్లేదు.
2005లో హిస్టరీ అఫ్ వయొలెన్స్ ని స్ఫూర్తిగా తీసుకుని లియో రాసుకున్నానని దర్శకుడు లోకేష్ కనగరాజ్ టైటిల్ కార్డులోనే ఒప్పేసుకున్నాడు. గాయం 2 కూడా దాని నుంచి ఇన్స్ పిరేషన్ తీసుకున్నదే. కాకపోతే మొత్తం కథ కాకుండా సగం వాడుకుని సెకండ్ హాఫ్ లో గాయం మొదటి భాగం తాలూకు ట్విస్టులను వాడుకున్నారు. కానీ అవి సరైన రీతిలో పండకపోవడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడీ జగపతిబాబు వీడియోని నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. లోకేష్ కాపీ కొట్టాడని, తెలుగులో ఎప్పుడో తీశారని రెండింటి పోలికలను బట్టబయలు చేస్తున్నారు. ఇలాంటి టాపిక్స్ దొరకాలే కానీజనం మాములుగా చెలరేగిపోరు.
This post was last modified on October 28, 2023 2:54 am
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏమాత్రం కష్టపడకుండా, సుకుమారంగా సినిమాలు చేస్తూనే వందల కోట్ల వసూళ్లు రాబట్టే హీరో అంటే సూపర్…
విడుదల ఇంకా పదమూడు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టడం ఈ మధ్య కాలంలో ఏ ప్యాన్ ఇండియా సినిమాకు…
ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఎన్నికలే కీలకం. తమ సత్తా నిరూపించేందుకు.... తమ బలం చాటుకునేందుకు ప్రజల్లో తమకు ఉన్న…
ఎంపిటిసీ, జడ్పిటీసీ ఎన్నికలకు సంబందించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లలో కూడా…
యూట్యూబ్‌లో ఫన్నీ వీడియోలు చేసుకునే మౌళి.. నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌తో తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక…
ఒకప్పుడు ఆషామాషీ గ్రాఫిక్స్ తో సినిమా తీసినా చెల్లిపోయేది. స్క్రీన్ ప్లే మేజిక్, మంచి పాటలు పడితే ఎఫెక్ట్స్ లోపాలు…