మాస్ రాజా రవితేజ రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేసినపుడే మెరుగైన ఫలితాలు వస్తుంటాయి. ఆయన డిఫరెంట్‌గా ఏదైనా చేయాలనుకున్న ప్రతిసారీ నిరాశే ఎదురవుతుంటుంది. ‘నా ఆటోగ్రాఫ్’ నుంచి ‘రామారావు ఆన్ డ్యూటీ’ వరకు ఇదే వరస. ఆయన విభిన్నంగా ట్రై చేసిన వాటిలో కొన్ని మంచి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. నా ఆటోగ్రాఫ్, సారొచ్చారు, డిస్కో రాజా ఇవేవీ కూడా తీసిపడేయదగ్గ సినిమాలు కాదు. తాజాగా ఆయన్నుంచి వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా మంచి ప్రయత్నమే.
ఇందులో చెప్పుకోదగ్గ ఆకర్షణలు ఉన్నాయి. కొన్ని ఎపిసోడ్లు స్టాండౌట్‌గా నిలిచాయి. కానీ ఓవరాల్‌గా సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది సినిమాలో చాలా అనవసర సీన్లు ఉన్నాయి. ప్రేక్షకులకు ఏమాత్రం రుచించని సన్నివేశాలున్నాయి. వాటి వల్ల నిడివి పెరిగిందే తప్ప ప్రయోజనం లేకపోయింది. ప్రేక్షకులకు ఏం చూపించాలి.. ఏం చూపించకూడదు అనే విషయంలో కొంచెం కసరత్తు చేసి ఉంటే ‘టైగర్..’ మెరుగైన సినిమ అయ్యుండేది.
ఈ సినిమాలో రవితేజ అభిమానులకే రుచించని కొన్ని సీన్లు ఉన్నాయి. తండ్రినే చంపే క్రూరుడైన కొడుగ్గా.. ఒక వేశ్య తాను అడగ్గాడే దగ్గరికి రాలేదని అందరి ముందు కడుపు మీద తన్ని కిరాతకంగా ప్రవర్తించే స్త్రీ లోలుడిగా.. ప్రేమించిన అమ్మాయితో కూడా చాలా అసభ్యంగా మాట్లాడే వ్యక్తిగా.. నిర్దాక్షిణ్యంగా దొంగతనాలు, హత్యలు చేసే దోపిడీదారుగా రవితేజను చూడటం ప్రేక్షకులకు ఏదోలా అనిపించింది. ఇంతకుముందు ‘రావణాసుర’లో కూడా రవితేజ ఇలాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రే చేశాడు. ఆ సీన్లన్నీ ఎబ్బెట్టుగా అనిపించాయి. హీరోలు నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయకూడదని కాదు. వాటికి సరైన జస్టిఫికేషన్ ఉండాలి. హ్యూమన్ యాంగిల్‌ను బలంగా చూపించాలి.
కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాల్లో ఆ అంశాలను బలంగా చూపించారు. జస్టిఫికేషన్ ఇచ్చారు. కానీ ‘టైగర్’లో అది జరగలేదు. ఎంటర్టైనర్లకు పేరుపడ్డ రవితేజకు ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి వాళ్లకు మాస్ రాజాను ఇలాంటి పాత్రల్లో చూడటం అస్సలు రుచించదు. రవితేజ ఇలాంటి పాత్రలు చేస్తే వాళ్లు థియేటర్లకు రావడం కష్టం. ఇకపై మాస్ రాజా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా.. అందులోని సన్నివేశాలు కొంచెం హద్దుల్లో ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆ పాత్రలకు సరైన జస్టిఫికేషన్ ఉండేలా జాగ్రత్త పడాలి. లేదంటే మాత్రం ఆయనకు ఈ వర్గం ప్రేక్షకులు దూరం అయిపోతారు.
This post was last modified on October 22, 2023 6:37 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…