Movie News

బాలయ్య విజయ్ ఇద్దరి బోణీ బాగుంది

నిన్న మొదలైన దసరా సినిమాల హంగామాలో భగవంత్ కేసరి, లియోలు మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్నాయి. బాలయ్య 32 కోట్ల గ్రాస్ సాధించినట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించగా విజయ్ తెలుగు వెర్షన్ నుంచే 16 కోట్లు రాబట్టినట్టు సితార సంస్థ అఫీషియల్ గా చెప్పింది. ఇవి మంచి నెంబర్లే. కంటెంట్ పరంగా రెండింటికి మంచి టాకే వచ్చింది. అయితే భగవంత్ కేసరికి ఫ్యామిలీ ప్రేక్షకుల మద్దతు దక్కే అవకాశాలు పెరగగా లియోకి మాస్ సపోర్ట్ మాత్రమే కనిపిస్తోంది. విక్రమ్, ఖైదీ స్థాయిలో లేకపోవడం పట్ల అభిమానులు పెదవి విరుస్తున్న మాట వాస్తవం.

టైగర్ నాగేశ్వరరావు టాక్ ఆశాజనకంగా లేకపోవడం పై రెండు సినిమాలకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మొదటి వీకెండ్ తో పాటు తర్వాత వచ్చే పండగ సెలవులు చాలా కీలకం కాబోతున్నాయి. బుకింగ్స్ ట్రెండ్ గమనిస్తుంటే బాలయ్య పై చేయి కావడం స్పష్టమే అయినా మరీ లెజెండ్, అఖండ రేంజ్ లో వసూళ్ల ఊచకోత ఉండకపోవచ్చనే కామెంట్స్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి గత చిత్రాలు రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు సైతం మొదటి రోజే యునానిమస్ హిట్ అనిపించుకున్నవి కాదు. క్రమంగా సూపర్ హిట్ జోన్ లోకి వెళ్లిపోయాయి.

ఇక బాలీవుడ్ మూవీ గణపథ్ ని తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ పట్టించుకోలేదు. హిందీ రివ్యూలు నెగటివ్ గా ఉండటంతో దాని మీద ఉన్న కాసింత ఆసక్తి కూడా సన్నగిల్లిపోయింది. సో భగంవత్ కేసరి, లియోలు తమకు దొరికిన గోల్డెన్ ఛాన్స్ ని ఏ మేరకు వాడుకుంటాయో చూడాలి. ఇవాళ హైదరాబాద్ లో బాలయ్య టీమ్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించగా రేపో ఎల్లుండో లియో కూడా తమ విజయానందాన్ని పంచుకోబోతోంది. ఇక టైగర్ నాగేశ్వరరావు స్టేటస్ స్పష్టంగా తెలియాలంటే ఆదివారం దాకా వేచి చూడాలి. ఫైనల్ గా మాట్లాడేది వసూళ్లే కాబట్టి వాటి ప్రాతిపదికన విజేత డిసైడవుతాడు. 

This post was last modified on October 20, 2023 3:54 pm

Share

Recent Posts

విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తున్నారా

నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…

47 minutes ago

అర్జెంటీనా సముద్రం ఇంకి పోయిందా?

అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని,…

1 hour ago

శాంసంగ్ ఏడేళ్ల కష్టం.. యాపిల్ ఎందుకింత ఆలస్యం

ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్‌ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…

2 hours ago

ఫౌజీ వెనుక అసలేం జరుగుతోంది

ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…

2 hours ago

స్కూలు సెలవు కోసం మర్డర్ ప్లాన్

మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…

2 hours ago

టాలీవుడ్ హీరోలూ… స్పీడ్ పెంచండయ్యా

కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…

2 hours ago