తమిళ బాక్సాఫీస్‌లో చాలా ఏళ్ల నుంచి విజయ్ ఆధిపత్యం నడుస్తోంది. రజినీకాంత్ రంగంలో ఉండగా ఆయన రేంజిని ఎవ్వరూ టచ్ చేయలేరని అనుకుంటున్న సమయంలో వరుస బ్లాక్‌బస్టర్లతో అతను సూపర్ స్టార్‌నే మించిపోయాడు. రజినీ వరుస డిజాస్టర్లు ఎదుర్కొంటున్న సమయంలోనే తుపాకి, కత్తి, తెరి, మెర్శల్, బిగిల్ లాంటి బ్లాక్‌బస్టర్లతో అతను దూసుకెళ్లాడు. వసూళ్లలో, రికార్డుల్లో రజినీని మించే స్థాయికి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో విర్రవీగుతూ ఉండేవాళ్లు.
కానీ అలాంటి వాళ్లందరికీ ‘జైలర్’ సినిమాతో రజినీకాంత్ సరైన సమాధానం చెప్పాడు. కానీ ‘లియో’ మూవీతో రజినీ రికార్డులను మళ్లీ విజయ్ అధిగమిస్తాడంటూ విజయ్ ఫ్యాన్స్ మళ్లీ తొడగొట్టారు. ఈ సినిమాకు విడుదల ముంగిట నెలకొన్న హైప్, జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ‘జైలర్’ను ‘లియో’ మించి పోతుందనే అనుకున్నారు. కానీ ఈ సినిమాలో విషయం లేదని బొమ్మ పడ్డాక కానీ అర్థం కాలేదు. అసలు ఏముందని విజయ్ ఈ సినిమా ఒప్పుకున్నాడా అని సినిమా చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.
పాత చింతకాయపచ్చడి కథతో, హడావుడి తప్ప విషయం లేని నరేషన్‌తో లోకేష్ కనకరాజ్.. విజయ్‌ని ఫూల్‌ని చేశాడనే చర్చ జరుగుతోంది. ‘లియో’ సినిమా చూశాక విజయ్ జడ్జిమెంట్ స్కిల్స్, మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్క్రిప్టు విన్నపుడు ఎలా ఉన్నా.. సినిమా తీస్తున్నపుడైనా అతడికి ఇందులో కంటెంట్ లేదనే విషయం అర్థమై ఉండాలి కదా అంటున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. లోకేష్ విజయ్‌తో సినిమా తీసినపుడే తేలిపోతున్నాడు. మానగరం, ఖైదీ, విక్రమ్ మూడు కూడా ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లుంటాయి. ఇంతకుముందు విజయ్‌తో అతను తీసిన ‘మాస్టర్’ కూడా అంచనాలకు తగ్గట్లు లేదు.
అయినా అది జస్ట్ ఓకే అనిపించింది. కానీ ‘లియో’ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీనికంటే ముందు విజయ్ చేసిన ‘బీస్ట్’ డిజాస్టర్ అయింది. అలాంటి సినిమా తీసిన నెల్సన్ దిలీప్‌కుమార్ తర్వాత ‘జైలర్’తో బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు. తన తొలి రెండు చిత్రాలు కంటెంట్ పరంగా రిచ్ అనిపిస్తాయి. మన వంశీ పైడిపల్లి కూడా తెలుగులో ఎన్నోసార్లు తీసిన కథనే అటు ఇటు తిప్పి ‘వారసుడు’ అంటూ విజయ్‌తో తీసి అతణ్ని బోల్తా కొట్టించాడు. డైరెక్టర్లు ఏం చెప్పినా విజయ్ ఓకే చెప్పేస్తున్నాడని.. వాళ్లు అతడితో ఆటాడుకుంటున్నారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి తన సినిమాలు చూస్తుంటే.
This post was last modified on October 20, 2023 3:49 pm
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…