నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటిటి ప్లాటుఫార్మ్స్ తో పోటీ పడలేక జీ5, సన్ నెక్స్ట్ లాంటి హేమాహేమీలే ఇబ్బంది పడుతున్నాయి. సన్ నెక్స్ట్ అయితే నెట్ ఫ్లిక్స్ తో మిలాఖత్ అయిపోయి అందులోని కొత్త సినిమాలన్నీ అక్కడ కూడా ఉండేలా ఒప్పందం చేసేసుకుంది. హాట్ స్టార్ ఏమో డిస్నీతో టైఅప్ అయి పోటీలో నిలబడేందుకు తంటాలు పడుతోంది.
ఇలాంటి టైంలో ఆహాతో ఈ రంగంలోకి వచ్చిన అల్లు అరవింద్ పోటీని ఎలా తట్టుకోవాలో తెలియక చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్ని వెబ్ సిరీస్ లు తీసినా కానీ తెలుగు సినిమా నుంచి పెద్ద సినిమాలు, కొత్త సినిమాలు ఆహాలో ఉంటే తప్ప జనం డబ్బులు కట్టరు. లాక్ డౌన్ సమయంలో పలు చిత్రాలు రిలీజ్ లేక నిలిచిపోవడంతో వాటికి అయిన ఖర్చు ఇచ్చి ఆహా ద్వారా రిలీజ్ చేయడానికి అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు.
నిర్మాతగా తనకున్న పలుకుబడితో పాటు మిగిలిన సంస్థల దగ్గర లేని సమాచారం కూడా కలిసి వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఇది కొంత రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అయినా కానీ అసలు థియేటర్లలో రాని సినిమాలు డైరెక్ట్ గా ఇంట్లో రిలీజ్ చేస్తే ఆ క్రేజే వేరు. మరి అరవింద్ ఇస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్ ని ముందుగా తీసుకునేదెవరో? ఒకరు ముందుకొస్తే ఆ ట్రెండ్ లో మరింత మంది ఫాలో అవుతారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates