రేణుదేశాయ్‍ దాగుడు మూతలు!

రేణుదేశాయ్‍ మొన్నామధ్య హైద్రాబాద్‍కి షిఫ్ట్ అయిపోయినట్టు వార్తలొచ్చాయి. పిల్లలకు అందుబాటులో వుండడం కోసం పవన్‍కళ్యాణ్‍ వారికోసం ఒక లగ్జరీ ఫ్లాట్‍ కొనిచ్చాడని రూమర్స్ వినిపించాయి. వాటిని రేణుదేశాయ్‍ కొట్టి పారేసింది. అయితే తానెక్కడ వున్నదీ ఆమె ఇప్పుడు దాచిపెడుతోంది. పుణెలో వున్నపుడు సోషల్‍ మీడియాలో ఫోటోలను ఆమె స్వేఛ్ఛగా పోస్ట్ చేసేది.

కానీ ఇప్పుడు తన ఫోటోల్లో బ్యాక్‍గ్రౌండ్‍ బ్లర్‍ చేస్తూ, కార్‍ నంబర్‍ ఎడిట్‍ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదిలావుంటే విలాసవంతమైన తన కార్లను రేణు దేశాయ్‍ అమ్మేసిందట. ఒక ఎలక్ట్రిక్‍ కారు కొనుగోలు చేసిందట. పర్యావరణానికి డీజిల్‍, పెట్రోల్‍ కార్లు ఎంత నష్టం చేస్తున్నదీ ఆమె సుదీర్ఘంగా వివరించింది. అందుకే తన వంతుగా ఇకపై ఎలక్ట్రిక్‍ కారునే వాడతానని, అందరూ అదే విధంగా పర్యావరణం కోసం ఆలోచించాలని రేణు కోరింది.

మారిషస్‍లో ఆయిల్‍ స్పిల్‍ వల్ల జరిగిన అనర్ధం ఆ ప్రాంతానికి తీరని ముప్పు తెచ్చేట్టు వుందని, భవిష్యత్తులో ఇలాంటివి నియంత్రించడానికి అయినా ఆయిల్‍ రహిత కార్లు, వాహనాల వినియోగానికి మొగ్గు చూపాలని రేణు తన ఫాలోవర్స్ కి చెప్పింది.