Movie News

సినిమా బాలేదన్నాడు.. చితకబాదారు

మొన్నేమో ఒక నటుడు సినిమా రివ్యూలు రాసే రైటర్ల మీద విరుచుకుపడ్డాడు. మీరు సినిమా తీసి తర్వాత రివ్యూలు రాయండి అన్నాడు లాజిక్ లేకుండా. ఇక ఏదైనా ఒక పెద్ద హీరో సినిమా బాలేదు అంటూ సోషల్ మీడియాలో ఎవరైనా ఒక పోస్టు పెడితే చాలు.. సదరు హీరో ఫ్యాన్స్ బూతులు అందుకుంటారు. అదే పనిగా సినిమాను టార్గెట్ చేయడం, బావున్న సినిమాను బాలేదని అనడం తప్పే కానీ.. బాలేని సినిమా మీద తమ అభిప్రాయాన్ని వెల్లడించడం కూడా తప్పయిపోతోంది.

కొత్త సినిమా రిలీజైనపుడల్లా హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో ముందుగా షోలు పడుతుంటాయి. షోలు అవ్వగానే బయట మైకులు పట్టుకుని మీడియా వాళ్లు, యూట్యూబ్ ఛానెళ్ల వాళ్లు సిద్ధంగా ఉంటారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఆ మైకుల ముందు అవాకులు చెవాకులు పేలే వాళ్లు, అనవసర హంగామా చేసేవాళ్లు ఎలాగూ ఉంటారు.

వాళ్లకు తోడు జెన్యూన్‌గా తమ అభిప్రాయం చెప్పే సగటు ప్రేక్షకులు కూడా ఉంటారు. ఈ శుక్రవారం ఉదయం ‘ఆదిపురుష్’ షో అనంతరం ఒక కుర్రాడు సినిమా బాలేదంటూ తన అభిప్రాయం చెబుతుంటే.. పక్కనే ఉన్న ప్రభాస్ అభిమానులకు కోపం వచ్చింది. నువ్వసలు సినిమా చూశావా.. ఎలా చూశావసలు.. సినిమా బాలేదని ఎలా అంటావు అంటూ తనతో గొడవకు దిగారు.

ఆ కుర్రాడు వాళ్లకు దీటుగానే బదులిచ్చాడు. టికెట్ కొని సినిమా చూశా.. నా అభిప్రాయం నేను చెబుతానంటూ వారితో వాదించాడు. ఈ మాటలు రుచించని ప్రభాస్ ఫ్యాన్స్ ఆ కుర్రాడి మీద దాడికి దిగారు. మీడియా కెమెరాల ముందే అతడిపై దాడి జరిగింది. ఈ వీడియో నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. సినిమా బాలేదంటే కొట్టడం ఏంటి.. ఎవరి అభిప్రాయం వాళ్లది కదా.. ఇదేం సంప్రదాయం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్‌ను నెటిజన్లు తప్పుబడుతున్నారు.

This post was last modified on June 16, 2023 5:17 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

4 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

5 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

5 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

5 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

8 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

8 hours ago