మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా బ్రో డాడీ రీమేకనే వార్త రెండు నెలల క్రితమే మొదలయ్యింది. ప్రాజెక్టు అఫీషియల్ గా మొదలుకాలేదు కాబట్టి యూనిట్ సభ్యులెవరూ దీని గురించి స్పందించలేదు. దీంతో నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. దీంతో స్వయానా మెగా ఫ్యాన్సే ఇంకెన్ని రీమేకులు చేస్తారు చిరు అంటూ నిలదీయడం మొదలుపెట్టారు. ఎప్పుడో ఓటిటిలో వచ్చిన మలయాళం బొమ్మ తప్ప ఇంకేం దొరకలేదానేది వాళ్ళ ఆవేదన. అందులో న్యాయముంది
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది ఖచ్చితంగా బ్రో డాడీ రీమేక్ కాదట. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఏడాది క్రితమే చిరంజీవిని పర్సనల్ గా కలిసి ఈ కథను ఓకే చేయించుకున్నాడని, కాకపోతే దర్శకుడు సెట్ అయ్యేలోపు కాస్త సమయం పట్టిందని, అంతే తప్ప బ్రో డాడీ ఛాయలు నామమాత్రం కూడా ఉండవని అంటున్నారు. సిద్దు జొన్నలగడ్డ శ్రీలీల ఇంకో యూత్ పెయిర్ గా నటించబోయే ఈ ఎంటర్ టైనర్ లో ఘరానా మొగుడు లాంటి మాస్ కామెడీ పాటు అన్ని కమర్షియల్ అంశాలు మేళవించి తీర్చిదిద్దుతారట. ఫైనల్ నెరేషన్ ఇంకో రెండు మూడు వారాల్లో ఉండబోతోంది
సో అభిమానులు రిలాక్స్ అవ్వొచ్చు. నిజానికి ఒక టైంలో చిరు బ్రో డాడీ మీద మనసు పడిన మాట వాస్తవమే. మోహన్ లాల్ హీరోగా పృథ్విరాజ్ సుకుమారన్ ఆయన కొడుకుగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా అది. కానీ వయసు మళ్ళాక తండ్రయ్యే పాత్రలో నటిస్తే కనక లేనిపోని ట్రోలింగ్ కి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుందని గుర్తించే చిరు ఆ ఆలోచన మానుకున్నట్టు మెగా కాంపౌండ్ న్యూస్. కాబట్టి ఏ కోణంలో చూసినా బ్రో డాడీ రీమేక్ వట్టి పుకారనే క్లారిటీ వచ్చేసింది. భోళా శంకర్ రిలీజ్ అయ్యాక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది
This post was last modified on June 16, 2023 5:24 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…