‘బాహుబలి’ ఎవ్వరూ ఊహించనంత బ్లాక్ బస్టర్ అయ్యాక రాజమౌళిని చూసి ఇన్‌స్పైర్ అయిన వాళ్లు ఉన్నారు. ఆయన్ని చూసి అసూయ చెందిన వాళ్లున్నారు. అలాగే ఏముంది ఆయన గొప్పదనం అంటూ తీసిపడేసిన వాళ్లూ లేకపోలేదు. ఈ మూడు వర్గాల వాళ్లూ సినిమాలు తర్వాత సినిమాలు తీశారు. కానీ వారిలో ఎవ్వరూ రాజమౌళి మ్యాజిక్‌ను మాత్రం రిపీట్ చేయలేకపోయారు.
ఇండియాలో బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ నుంచి గత ఎనిమిదేళ్లలో ఎన్నో భారీ చిత్రాలు వచ్చాయి. వాటిలో ఒక్కటీ ‘బాహుబలి’ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. ఇక ఇండియాలో కంటెంట్ పరంగా తమ తర్వాతే ఎవరైనా అని ఫీలయ్యే కోలీవుడ్ సైతం ‘బాహుబలి’ తరహా భారీ ప్రయత్నాలు చేసి బోల్తా కొట్టింది. మిగతా ఇండస్ట్రీల వాళ్లు కూడా ‘ఎపిక్’ మూవీస్ ట్రై చేసి దెబ్బ తిన్నారు. ఇప్పుడు ఈ కోవలో నిరాశకు గురి చేసిన సినిమా ‘ఆదిపురుష్’.
‘బాహుబలి’ కథానాయకుడైన ప్రభాస్‌నే పెట్టి.. తానాజీ దర్శకుడు ఓం రౌత్ తీసిన ఈ చిత్రం.. బడ్జెట్, భారీతనం, ప్రి రిలీజ్ హైప్ పరంగా ‘బాహుబలి’ని మ్యాచ్ చేసేట్లు కనిపించింది. ఒకప్పుడు ఈ సినిమాపై ఎంతో నెగెటివిటీ కనిపించినప్పటికీ.. రిలీజ్ టైంకి అంతా సానుకూలంగానే కనిపించింది. హైప్ మామూలుగా లేదు. కానీ తెర మీద బొమ్మ పడ్డాక కథ మారిపోయింది. ప్రేక్షకుల అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయాడు ఓం రౌత్. సినిమాకు ఉన్న హైప్‌కి కంటెంట్ ఓ మోస్తరుగా ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరిగేవి.
కానీ విజువలైజేషన్లో, విజువల్ ఎఫెక్ట్స్‌ను వాడుకోవడంలో, భావోద్వేగాలను పండించడంలో ఓం రౌత్ తేలిపోయాడు. ఈ విషయాల్లో రాజమౌళిని కొట్టేవాడు ఇండియాలో లేరనిమరోసారి రుజువైంది. ‘ఆదిపురుష్’ రిలీజ్ రోజు అందరూ జక్కన్నను తలుచుకుని తనకు తనే సాటి అని కొనియాడుతున్నారు. ఇలాంటి ఎపిక్ మూవీస్ రాజమౌళికి వదిలేసి మామూలు సినిమాలు తీసుకోవాలని రౌత్ లాంటి దర్శకులకు సలహాలిస్తున్నారు.
This post was last modified on June 16, 2023 4:45 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…