ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎవరు లేనంత వేగంగా సినిమాలు చేస్తున్న మాస్ మహారాజా మరో యాక్షన్ ధమాకాతో రెడీ అవుతున్నాడు. దర్శకుడిగా మారిన ఎడిటర్ కార్తీక్ ఘట్టమనేని డెబ్యూ మూవీకి ఈగల్ టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తూ టీజర్ వీడియో విడుదల చేశారు. కాన్సెప్ట్ ఏంటో చూచాయగా చెబుతూనే చాలా సీరియస్ జానర్ ని టచ్ చేశారనే హింట్ అయితే ఇచ్చారు. 2024 సంక్రాంతి రిలీజ్ అని చెప్పి మరో ట్విస్టు ఇచ్చారు. ఇప్పటికే తీవ్రమైన పోటీతో వేడెక్కిన పండగ సీజన్ లో మాస్ రాజా ఎంట్రీతో పోటీ ఇంకా రసవత్తరంగా మారడం ఖాయం.
ఇక వీడియో విషయానికి వస్తే పాయింట్ ఇంటరెస్టింగ్ గా ఉంది. ఒక హంతకుడి కోసం ఇంటెలిజెన్స్ వర్గాలు వెతుకుతూ ఉంటాయి. ముందు అతనో పెయింటర్ అని తెలుస్తుంది. తర్వాత పత్తి రైతులకు అత్యంత కావాల్సిన మనిషిగా ఎవరెవరో గొప్పగా చెబుతారు. ఎన్నో అవతారాలు ఎన్నో రూపాలు. ఒకే ఐడెంటిటీ ఎక్కడ ఉండదు. దీంతో అతన్ని పట్టుకోవడం అంతు చిక్కని రహస్యంగా మారుతుంది. ఇంతకీ ఈగల్ వేట ఎవరి కోసం, దేని కోసం లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే దసరాకు టైగర్ నాగేశ్వరరావు చూసి జనవరి దాకా వెయిట్ చేయక తప్పదు
విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. థీమ్ ని పూర్తిగా రివీల్ చేయకపోయినా క్రైమ్ మిక్స్ చేసిన థ్రిల్లర్ అనే హింట్ ఇచ్చారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, మధుబాల ద్వారా ఇందులో ఎంత పెద్ద క్యాస్టింగ్ ఉందో చిన్న క్లూస్ ఇచ్చారు. సంగీత దర్శకుడిగా డవ్ జంద్ పరిచయం కాబోతున్నాడు. ఏడాదికి కనీసం మూడు రిలీజులు ఉండేలా చూసుకుంటున్న రవితేజకి ఈగల్ తోనే కొత్త సంవత్సరం బోణీ జరగబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద రూపొందిన ఈ థ్రిల్లర్ తో రవితేజ మరోసారి వయొలెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates