ప్రాజెక్ట్ Kలో కమల్ హాసన్?

ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ తో ప్యాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కెలో లోక నాయకుడు కమల్ హాసన్ నటించవచ్చనే వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఒక కీలకమైన పాత్ర కోసం దర్శకుడు నాగ అశ్విన్ సంప్రదిస్తే వెంటనే ఓకే చెప్పకపోయినా సానుకూలంగా స్పందించినట్టు చెన్నై అప్డేట్. కేవలం ఇరవై రోజులు కాల్ షీట్స్ ఇస్తే ఆ భాగం పూర్తి చేస్తానని డిటైల్డ్ నేరేషన్ ఇచ్చినట్టు సమాచారం. ఇండియన్ 2లో యమా బిజీగా ఉన్న కమల్ సెప్టెంబర్ దాకా ఫ్రీ అయ్యే అవకాశం లేదని తెలిసింది

ఇప్పటికే ప్రాజెక్ట్ కెలో భారీ క్యాస్టింగ్ సెట్ అయ్యింది. హీరోయిన్ దీపీకా పదుకునే, బిగ్ బి అమితాబ్ బచ్చన్ లతో పాటు అనుపం ఖేర్ లాంటి అనుభవజ్ఞులు సినిమాలో భాగమయ్యారు. ఒకవేళ కమల్ కనక తోడైతే హైప్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయి తమిళ వెర్షన్ కూ విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఇది నిజం కావాలనే ఫ్యాన్స్ కోరుకుంటారు. సంక్రాంతి విడుదలకు టార్గెట్ గా పెట్టుకున్న వైజయంతి మూవీస్ ఆ డెడ్ లైన్ ని అందుకోవడం  కొంచెం అనుమానంగానే ఉంది. ఒకవేళ మిస్ అయితే మాత్రం 2024 సమ్మర్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు.

ప్రస్తుతానికి జనవరి 12లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసిన నాగ అశ్విన్ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేయిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో విదేశీ బృందాలు ఆ వర్క్ లో బిజీగా ఉన్నాయి. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో పూర్తిగా స్కైఫై థ్రిల్లర్ గా రూపొంతుతున్న ప్రాజెక్ట్ కెలో ప్రభాస్ పాత్ర సూపర్ హీరో తరహాలో అతీతమైన శక్తులతో ఉంటుందట. దిశా పటాని కూడా ఇందులో భాగమైన సంగతి తెలిసిందే. మొత్తానికి ప్రాజెక్ట్ కె క్యాస్టింగ్ దెబ్బకే ఓ వంద కోట్లు అదనంగా బిజినెస్ రాబట్టేలా ఉంది