Movie News

నాగ్ డౌట్లన్నీ తీరిపోయాయి

వరుస ఫెయిల్యూర్లు ఎలాంటి వ్యక్తి ఆత్మవిశ్వాసాన్నయినా దెబ్బ తీస్తాయి. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఇంకెవరూ చేయనన్ని ప్రయోగాలు చేసి.. ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశమిచ్చి అద్భుత ఫలితాలు రాబట్టిన అక్కినేని నాగార్జున సైతం ఈ మధ్య బాగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు. కథలు, దర్శకుల ఎంపికలో పొరపాట్లు ఆయన కెరీర్‌ను కిందికి లాగేశాయి. ‘ది ఘోస్ట్’తో ఆయన పతనంలో కొత్త లోతులను చూశారు. ఈ దెబ్బతో తర్వాతి సినిమా విషయంలో ఆయనలో ఎక్కడలేని అయోమయం మొదలైంది.

ముందు అనుకున్న ప్రకారం అయితే.. రైటర్ ప్రసన్న కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ మలయాళ రీమేక్‌లో నటించాలన్నది నాగ్ ఆలోచన. కథ ఓకే చేశారు. నిర్మాత (శ్రీనివాసా చిట్టూరి) కుదిరాడు. ఇక ముహూర్త వేడుకే తరువాయి అనుకున్న టైంలో నాగ్ ఆలోచన మారింది. తనకు తోడు తన కొడుకులిద్దరూ కూడా పెద్ద ఫెయిల్యూర్లు ఎదుర్కొని అక్కినేని లెగసీనే ప్రమాదంలో పడటంతో నాగ్.. ఈ సారి చిన్న తప్పు చేయడానికి కూడా ఆస్కారం లేకపోయింది.

కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తాను చాటిచెప్పాల్సిన స్థితిలో స్క్రిప్టు విషయంలో మళ్లీ తర్జన భర్జనలు మొదలయ్యాయి. అంతే కాక ఒక దశలో దర్శకుడిని మార్చేయాలన్న చర్చ కూడా జరిగింది. ‘కస్టడీ’ రిలీజ్ టైంలో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మీడియాతో మాట్లాడుతూ.. ప్రసన్ననే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని చెప్పలేం అన్నట్లుగా మాట్లాడాడు.

ఐతే గత కొన్ని రోజుల చర్చల అనంతరం ఈ డైలమా నుంచి నాగ్ బయటికి వచ్చేశాడట. సినిమా చూపిస్త మావ మొదలుకుని ధమాకా వరకు ప్రసన్న కుమార్ జైత్రయాత్ర చూస్తే.. అతడికి కమర్షియల్ అంశాలు.. జనాల అభిరుచిపై ఉన్న పట్టును చూసి.. తనకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడంలో తప్పులేదని నాగ్ అండ్ టీం ఫిక్సయిందట. అలాగే స్క్రిప్టు విషయంలో మరింత కసరత్తు జరిగి.. మాతృకకు చేసిన మార్పులు చేర్పుల విషయంలో నాగ్ సంతృప్తిగా ఉన్నాడని.. జూన్ మధ్యలో షూట్‌కు వెళ్లిపోదామని కూడా చెప్పేశాడని.. అంతకంటే ముందు ముహూర్త వేడుక కూడా చేయబోతున్నారని సమాచారం.

This post was last modified on May 25, 2023 6:51 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

1 hour ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

2 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

2 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

2 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

4 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

5 hours ago