ఆలస్యం అమృతం విషమని పెద్దలు ఊరికే అనలేదు. ఏ టైంలో జరిగాల్సినవి ఎప్పటికప్పుడు అయిపోవాలి. లేదంటే ఫలితాలు చేదుగా ఉంటాయి. మేజర్ విషయంలో అదే జరిగింది. విడుదలైన ఏడాదికి ఈ సినిమా శాటిలైట్ ప్రీమియర్ ఇటీవలే టెలికాస్ట్ చేశారు. ప్యాన్ ఇండియా హిట్ మూవీ కాబట్టి టిఆర్పి రేటింగ్ ని భారీగా ఆశించారు. కానీ మరీ అన్యాయంగా అర్బన్ 1.87, అర్బన్ రూరల్ కలిపి 1.70 మాత్రమే వచ్చింది. ఇది చాలా దారుణమైన నెంబర్. బ్లాక్ బస్టర్స్ మొదటిసారి ప్రసారమైనప్పడు హీనపక్షం నాలుగు నుంచి అయిదు మధ్యలో రావాలి. మేజర్ సగం కూడా రాలేదు.
ఓటిటిలు ఉధృతంగా ఉన్న ట్రెండ్ లో టీవీ ఛానల్స్ కొత్త సినిమాలను అందివ్వడంలో చేస్తున్న ఆలస్యం, చూపిస్తున్న అలసత్వం క్రమంగా ఆడియన్స్ లో ఆసక్తిని చంపేస్తోంది. రిలీజైన రెండు వారాల నుంచి నెలన్నర మధ్యలో హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు డిజిటల్ లో వస్తున్నప్పుడు అదే పనిగా బుల్లితెరపై చూడాలంటే వీలైనంత త్వరగా రావాలి. బలగం ఇలాంటి ప్లానింగ్ లో చాలా తెలివిగా వ్యవహరించింది. వంద రోజులు కాగానే వచ్చేయడంతో ఏకంగా 12 రేటింగ్ తో షాక్ ఇచ్చింది. ఇటీవలి కాలంలో దేనికీ రానంత భారీ ఫిగర్ ఇది.
మొత్తానికి మేజర్ ఒక పాఠంగా నిలిచాడు. గత ఏడాది విడుదలైన సమయంలో విమర్శకుల ప్రశంసలు అందుకుని రెవిన్యూ పరంగానూ సక్సెస్ అయిన ఈ రియల్ హీరో బయోపిక్ త్వరగా టీవీకి తీసుకొచ్చి ఉంటే రీచ్ పెరిగేది. ఒకపక్క నెట్ ఫ్లిక్స్ లో ఎప్పటి నుంచో అందుబాటులో ఉండటం, దాని పైరసీ కాపీని లోకల్ ఛానల్స్ ఎప్పుడో వేసేయడం లాంటి కారణాల వల్ల బజ్ ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. హక్కులు ఇచ్చేదాంట్లో లేట్ అయ్యిందో లేక ఇంకేదయినా కారణం ఉందో ఏమో కానీ మొత్తానికి మేజర్ కు టిఆర్పి షాక్ గట్టిగానే తగిలింది
This post was last modified on May 25, 2023 7:07 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…