ఏజెంట్ డిజాస్టర్ తో బాగా డిస్టర్బ్ అయిన అఖిల్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ బయట ఎక్కడా కనిపించలేదు. ఇంత కష్టపడి చేసిన సినిమా ఫ్లాప్ కావడం ఒక ఎత్తయితే అక్కినేని అభిమానుల్లో నిరాశ రెట్టింపు కావడం అసలైన బాధ. కెరీర్ మొదలుపెట్టి ఏడేళ్లవుతున్నా ఒక్క బ్లాక్ బస్టర్ పడలేదన్న ఆక్రోశం అఖిల్ లో విపరీతంగా ఉంది. ఇప్పుడది తీర్చే బాధ్యతను రామ్ చరణ్ తీసుకోబోతున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ విక్రమ్(యువి భాగస్వామి) తో కలిసి మొదలుపెట్టబోయే వి మెగా బ్యానర్ ఫస్ట్ వెంచర్ గా అఖిల్ మూవీనే ఉండబోతోందట
ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ మీద చరణ్ కు చాలా అఫెక్షన్ ఉంది. అందుకే ఏజెంట్ ప్రమోషన్ కోసం రామ్ చరణ్ షల్ ప్రత్యేకంగా ఒక వీడియో టీజర్ బిట్ లో ధృవ గెటప్ లో నటించాడు. ఇంతకు ముందు ఇలా ఎవరికీ చేయలేదు. పలు ఇంటర్వ్యూలలో అఖిల్ కూడా అన్నయ్య లాగా మెగా పవర్ స్టార్ నుంచి ఎలాంటి గైడెన్స్ తీసుకుంటానో చెప్పాడు. ఈసారి కథ ఎంపిక, దర్శకుడిని గైడ్ చేయడం వగైరా వ్యవహారాలన్నీ అఖిల్ చూసుకోడట. మొత్తం చరణ్ పర్యవేక్షణలో విక్రమ్ టీమ్ జాగ్రత్తలు తీసుకుని అన్నీ సెట్ చేయబోతోంది.
ఇలా అయినా అఖిల్ కు బ్రేక్ దక్కతే చాలని అభిమానులు కోరుకుంటున్నారు. యువిలోనే పలు సినిమాలకు పని చేసిన అనిల్ ని దీని ద్వారా దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. ఎప్పటి నుంచి సెట్స్ పైకి వెళుతుందనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఏది ఏమైనా అఖిల్ వీలైనంత త్వరగా సినిమాల వేగం పెంచాలి. అటు నాగచైతన్య కస్టడీతో దెబ్బ తిన్నాడు. నాన్న నాగార్జున ప్రాజెక్ట్ జనవరి నుంచి వాయిదా పడుతూ జూన్ లో షూటింగ్ మొదలుకాబోతోంది. ఇలాంటి పరిస్థితిలో ఎవరో ఒకరు స్పీడ్ గా ఉండటం అవసరం. చైతు రెండు లాక్ చేసుకున్నాడు కానీ అఖిల్ కి ఒకటే ఫైనలయ్యింది
This post was last modified on May 26, 2023 11:37 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…