Movie News

ప్రేక్ష‌కుల‌తో ఫుట్‌బాల్ ఆడుకున్న రుద్రుడు


త‌మిళ సినిమాలంటే ఒక‌ప్పుడు చాలా కొత్త‌గా ఉండేవి. అక్క‌డ ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు జ‌రిగేవి. అక్క‌డ్నుంచి డ‌బ్ అయి వ‌చ్చే సినిమాల‌ను మ‌న‌వాళ్లు ఎగ‌బ‌డి చూసేవాళ్లు. ఇలాంటి సినిమాలు మ‌న ద‌గ్గ‌ర రావ‌ట్లేదేంటి అని ఫీల‌య్యేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో మారింది. మ‌న ద‌గ్గ‌రే ఎన్నో ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా త‌మిళ సినిమాల క్వాలిటీ దారునంగా ప‌డిపోయి. స్టార్ హీరోలు స‌హా అంద‌రూ అక్క‌డ రొటీన్ మ‌సాలా సినిమాలు చేసుకుంటూ గ‌డిపేస్తున్నారు.

ఈ సంక్రాంతికి రిలీజైన విజ‌య్, అజిత్ సినిమాలు వారిసు, తునివు కూడా రొటీన్ సినిమాలే అన్న సంగ‌తి తెలిసిందే. వాళ్లే అలాంటి సినిమాలు చేస్తే ఇక లారెన్స్ ఎలాంటి సినిమాలు చేస్తాడో అంచ‌నా వేయొచ్చు. మామూలుగానే అత‌ను రొటీన్ రొడ్డ‌కొట్టుడు సినిమాలు చేస్తుంటాడు. ఇప్పుడు రుద్రుడు పేరుతో వ‌చ్చిన లారెన్స్ కొత్త సినిమా చూస్తే మాస్ ప్రేక్ష‌కుల‌కు సైతం దిమ్మ‌దిరిగి బొమ్మ క‌న‌బ‌డ‌టం ఖాయం.

ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన అత్యంత దారుణ‌మైన హింసాత్మ‌క చిత్రంగా రుద్రుడును చెప్పొచ్చు. పేరుకేమో ఇందులో హీరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. కానీ త‌న ప్ర‌తీకారంలో భాగంలో ప‌దుల సంఖ్య‌లో త‌ల‌లు తెగ్గొడుతుంటాడు. క‌థ‌లో అస‌లు ఎమోష‌న్ అంటూ ఏమీ లేకుండా విప‌రీత‌మైన ఫైట్ల‌తో సినిమాను నింపేశాడు ద‌ర్శ‌కుడు. లారెన్స్‌తో ఇంత వ‌యొలెంట్ సినిమా తీయాల‌ని ద‌ర్శ‌కుడికి ఎందుకు అనిపించిందో ఏమో?

ఇక సినిమాలో ప్రియా భ‌వాని శంక‌ర్ లాంటి అంద‌మైన క‌థానాయిక ప‌క్క‌న లారెన్స్ అస్స‌లు సూట్ కాలేదు. ఆమెతో రొమాంటిక్ స‌న్నివేశాల గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. సెంటిమెంట్ సీన్ల‌యితే మ‌రీ హ‌ద్దులు దాటిపోయి కొన్ని ద‌శాబ్దాలు వెన‌క్కి తీసుకెళ్తాయి. లారెన్స్ స‌హా న‌టీన‌టులంతా అవ‌స‌రానికి మించి న‌టించేసి ప్రేక్ష‌కుల‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. రొటీన్ మాస్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డేవారు కూడా హాహాకారాలు చేసేలా ఉన్న రుద్రుడు.. ప్రేక్ష‌కుల‌తో లిట‌ర‌ల్‌గా ఫుట్‌బాల్ ఆడేసుకున్నాడంటూ సోష‌ల్ మీడియాలో కౌంట‌ర్లు ప‌డుతున్నాయి. పొర‌పాటున కూడా ఈ సినిమా థియేట‌ర్ల వైపు వెళ్లొద్దంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు చూసిన వాళ్లు.

This post was last modified on April 14, 2023 10:38 pm

Share

Recent Posts

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

10 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

45 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

49 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

1 hour ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

5 hours ago