టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే నిమ్మకూరు, గుడివాడ ప్రాంతాల్లో ఆయన వరుసగా సభలు పెట్టారు. అదేవిధంగా మచిలీపట్నంలోనూ పర్యటించారు. అయితే.. చంద్రబాబు పర్యటనలో తమకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని.. తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు చూసీ చూడనట్టే వ్యవహరించారు. ముఖ్యంగా నాలుగు నియోజకవ ర్గాల్లో నేతల మధ్య సమస్యలు ఉన్నాయి.
గుడివాడ, నూజివీడు, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని టీడీపీ నాయకుల మధ్య వివాదాలు జరు గుతున్నాయి. ముఖ్యంగా గుడివాడలో కొత్తగా వచ్చిన వెనిగళ్ల రాముకు టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది. తాజాగా ఇక్కడ సభ పెట్టారు. ఈ సభను విజయవంతం చేయడంలో రాము సక్సెస్ అయ్యారు. ఇక, ఈ సభ వేదికగానే.. ఆయన పేరు ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, చంద్రబాబు కనీసం పేరు కూడా ఎత్తే ప్రయత్నం చేయలేదు.
మరోవైపు పెనమలూరులోనూ.. బోడే ప్రసాద్‌కు వ్యతిరేకంగా రెండు వర్గాలు పనిచేస్తున్నాయి. ఈ రెండు వర్గాల కారణంగానే.. గత ఎన్నికల్లో బోడే ప్రసాద్ పరాజయం పాలయ్యారనే వాదన ఉంది. ఈ పర్యటన ద్వారా ఆయా వర్గాలను కూర్చోబెట్టి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తారని.. చంద్రబాబుపై ఇక్కడి నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, దీనిపైనా చంద్రబాబు స్పందించలేదు. మరోవైపు.. పామర్రులోనూ.. టికెట్ పోరు తారస్థాయికి చేరింది.
వర్ల రామయ్య కుమారుడు, కుమార్ రాజా కు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా.. మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కూడా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇక్కడ ఇరు వర్గాల మధ్య అంతర్యుద్ధం జోరుగా సాగుతోంది. అదేవిధంగా నూజివీడులోనూ చంద్రబాబు పర్యటనపై ఆశలు రేకెత్తాయి. ఇక్కడ కూడా వర్గ పోరు తారస్థాయిలో ఉండడంతో వాటిని పరిష్కరించాలని.. తమ్ముళ్లు కోరుతున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం కేవలం.. ఒక వైపే చూస్తుండడంతో ఎక్కడి ఘర్షణలు అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయాయి.
This post was last modified on April 14, 2023 10:15 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…