బాలీవుడ్ బడా హీరోలు మన స్టార్లతో జట్టు కట్టేందుకు ఎంతగా ఉత్సాహపడుతున్నారో ఈ మధ్య కాలంలో గమనిస్తూనే ఉన్నాం. ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్ ప్రత్యేక పాత్రలో నటించాడు. లాల్ సింగ్ చద్దా కోసం అమీర్ ఖాన్ కోరిమరీ నాగ చైతన్యకు స్నేహితుడి పాత్రను ఆఫర్ చేశారు. జస్ట్ మాటవరసకు అడగ్గానే చిరంజీవి పిలుపు మీద సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వచ్చి గాడ్ ఫాదర్ చేశారు. దానికి బదులుగా రామ్ చరణ్ కిసీకా భాయ్ కిసీకా జాన్ లో తళుక్కున మెరిసే డాన్స్ లో పాలు పంచుకున్నాడు. తాజాగా వీటన్నటికి తలదన్నే క్రేజీ కాంబినేషన్ ఒకటి సెట్ కాబోతోందని ముంబై అప్ డేట్
2019లో వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ వార్ లో హృతిక్ రోషన్ – టైగర్ శ్రోఫ్ లు నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే యష్ రాజ్ ఫిలింస్ దీనికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉంది. కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఫైనల్ గా వార్ 2కి స్టేజి సెట్ అయ్యింది. అయితే మొదటి భాగం తీసిన సిద్దార్థ్ ఆనంద్ కి కాకుండా ఆ బాధ్యతను ఈసారి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీకి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ట్విస్టు ఏంటంటే హృతిక్ ఈ పార్ట్ టూలో కొనసాగనుండగా తనను ఢీ కొట్టే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడని లీక్ వచ్చింది.
విశ్వసనీయ వర్గాల నుంచి బయటికి రావడంతో ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇండియాలో బెస్ట్ డాన్సర్స్ ఫైటర్స్ లో ఇద్దరైన హృతిక్ తారక్ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ప్రాథమికంగా చర్చలు పూర్తయినట్టు సమాచారం. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2, 3 మొదలుపెట్టేలోగా ఈ వార్ 2ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లానింగ్ జరుగుతోంది. కాకపోతే కాస్త టైం ఎక్కువ పట్టేలా ఉంది. కొరటాల శివ ప్రాజెక్టులో బిజీగా ఉన్న తారక్ మనసులో ఏముందో ఏం చెప్పాడో వేచి చూడాలి
This post was last modified on April 5, 2023 11:23 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…