ఫ్యాన్స్ కి పుష్ప రాజ్ డబుల్ గిఫ్ట్

పుష్ప ది రూల్ కి సంబంధించి ఇంత వరకూ ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. షూటింగ్ విషయాలు కూడా మేకర్స్ చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో ఆ మధ్య బన్నీ ఫ్యాన్స్ ఎన్నడూ లేని విధంగా అప్ డేట్స్ కోసం రోడ్డెక్కారు.

వెంటనే బన్నీ టీం రంగంలో దిగడంతో సైలెంట్ అయిపోయారు. అయితే ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న పుష్ప టీజర్ తో టీం అప్ డేట్ ఇవ్వబోతున్నారు. పుష్ప 2 టీజర్ గ్లిమ్స్ రిలీజ్ కానున్న సంగతి ఫ్యాన్స్ కి తెలిసిందే. అయితే దానికి తోడు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు.

బన్నీ పుట్టిన రోజు కి ఒకరోజు ముందే అంటే ఏప్రిల్ 7 న పుష్ప ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతుంది. ఇందులో బన్నీ లుక్ మెస్మరైజ్ చేస్తుందని తెలుస్తుంది. ఆ మరుసటి రోజు బన్నీ ను విశ్ చేస్తూ టీజర్ రిలీజ్ చేయనున్నారు.

గతంలో కట్ చేసిన టీజర్ గ్లిమ్స్ నే ఇప్పుడు బర్త్ డే టీజర్ గా రిలీజ్ చేయనున్నారు. సో అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న బన్నీ ఫ్యాన్స్ కి టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బోనస్ గా ఉండబోతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ , టీజర్ గ్లిమ్స్ తో అల్లు అర్జున్ ఏ రేంజ్ హంగామా చేస్తాడో చూడాలి.