సముద్రఖని దర్శకత్వంలో పవన్ ‘వినోదాయ సీతమ్’ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ కంప్లీట్ చేసేశాడు పవర్ స్టార్. ఈ మధ్య కాలంలో పవన్ ఇంత ఫాస్ట్ గా ఓ సినిమా కంప్లీట్ చేసింది లేదు. ఈ రీమేక్ కోసం 22 రోజుల డేట్స్ ఇచ్చాడు. సాంగ్స్ మినహా పవన్ వర్క్ ఫినిష్ అయింది. పాటలు , ప్యాచ్ వర్క్ కి మరో వారం ఇవ్వనున్నాడు పవన్.
అయితే ఆ ఘాట్ ఇప్పుడే ఉండకపోవచ్చు. పవన్ లేకుండా తేజ్ ఫ్యామిలీ సీన్స్ తీసేందుకు రెడీ అవుతున్నారు. పవన్ వచ్చే నెలలో లేదా ఆ పై వచ్చే నెలలో మళ్ళీ ఐదారు రోజులు డేట్స్ ఇస్తాడు. అయితే ఈ రీమేక్ కొన్ని నెలల క్రితమే ఫిక్సయింది. పవన్ తన లైనప్ లో లేని గ్యాప్ క్రియేట్ చేసి మరీ ఈ సినిమాను కంప్లీట్ చేశాడు. దీంతో పవన్ ‘హరి హర వీరమల్లు’ ఘాట్ ను పట్టించుకోవడం లేదనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి.
నిజానికి పవన్ క్రిష్ సినిమా ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సి ఉంది. కానీ పవన్ పొలిటికల్ గా బిజీ అవ్వడం, సరిగ్గా డేట్స్ ఇవ్వకపోవడంతో ఘాట్ నత్తనడకన సాగుతుంది.
వినోదాయ సీతమ్ రీమేక్ డేట్స్ బదులు హరిహర వీరమల్లు కి ఓ నెల రోజులు ఇచ్చి ఉంటే ఆ ఘాట్ మరికొంత భాగం పూర్తయ్యేది. కానీ కొత్త రెమ్యునరేషన్ , త్రివిక్రమ్ బ్యాక్ బోన్ గా ఉండటంతో తన పాన్ ఇండియా సినిమాను పక్కన పెట్టేసి మరీ ఈ రీమేక్ ను ముందుకు తెచ్చాడు పవన్.
నెల రోజుల్లో ఓ సినిమాను కంప్లీట్ చేసేసి ఔరా అనిపించిన పవన్ మరి ‘హరి హర వీరమల్లు’ ను ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ? అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎలక్షన్స్ లోపు ఈ పీరియాడిక్ సినిమాను కంప్లీట్ చేయకపోతే నిర్మాతలకి మరింత బడ్డెన్ అవుతుంది. వచ్చే వారం నుండి హరీష్ ఉస్తాద్ భగత్ సింగ్ కి డేట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత సుజీత్ సినిమా సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఆ తర్వాత పవన్ ‘హరి హర వీరమల్లు’ ఘాట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates