చప్పుడు లేకుండా ఇంకో ఒటిటి రిలీజ్!

ఓటిటిలో రిలీజ్ చేసే సినిమాలకు నామ మాత్రపు ప్రచారం చేయడానికి నిర్మాతలు ప్రయత్నించడం లేదు. సినిమా బాగుందని అంటే టాక్ బాగా వచ్చి, వ్యూస్ అవే వస్తాయని, మళ్ళీ పబ్లిసిటీ కోసం అదనపు ఖర్చు దేనికని భావిస్తున్నారు. కానీ బాలీవుడ్ సినిమాలకు అలా చేయడంలేదు. వాటికి ప్రచారం దండిగానే చేస్తున్నారు. ఇక ఓటిటిలో కొత్తగా వస్తున్న సినిమా ఏమిటంటే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.

మలయాళ చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రానికి బాహుబలి నిర్మాతలు వెనక ఉన్నారు. కేరాఫ్ కంచరపాలెం సినిమా తీసిన వెంకటేష్ మహా దర్శకుడు. సత్యదేవ్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం గురువారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. మరి ఇటీవల విడుదలైన ఓటిటి సినిమాల మాదిరిగా మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content