అనుమానాలే నిజమయ్యాయి. సీనియర్ నటులు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ నిజంగానే పెళ్లి చేసుకున్నారంత రేంజ్ లో హడావిడి చేసిన వీడియోలు సినిమా కోసమని అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ఈ తతంగం పై చాలా అనుమానాలు ఉన్నా సోషల్ మీడియాలో ఇదంతా వాస్తవమే అనేంత రేంజ్ లో వైరలయ్యాయి. మళ్ళీ పెళ్లి అనే సినిమాని ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్ స్వయంగా నిర్మించారు. దాని తాలూకు చిన్న ప్రోమోను ఇవాళ రిలీజ్ చేశారు. ముందు సెకండ్ ఇన్నింగ్స్ టైటిల్ అనుకున్నారు కానీ ఫైనల్ గా మార్చేశారు
మొత్తానికి స్కెచ్ మాత్రం అదిరింది. ఒకపక్క తమ బంధం గురించి నరేష్ పవిత్రలు పదే పదే స్పష్టత ఇవ్వడంతో పాటు ఎలాంటి స్టార్ అట్రాక్షన్ లేని మూవీకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. ఇది తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా రేంజ్ లో కన్నడ ఇతర భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. సాంకేతిక వర్గాన్ని బలంగా సెట్ చేసుకున్నారు. శరత్ బాబు, జయసుధ, వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ళ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత ఘాడంగా ఉందో మరోసారి కెమెరా ముందు నరేష్ పవిత్రలు ఆవిష్కరించారు
ఇటీవలే జరిగిన అన్నీ మంచి శకునములే సాంగ్ లాంచ్ తనను తాను నిత్య పెళ్లి కొడుకుగా వర్ణించి నవ్వించిన నరేష్ రెండు రోజుల గ్యాప్ తో ఇలా స్వీట్ ట్విస్టు ఇచ్చారు. ఇద్దరి సహజీవనం గురించి అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ లీగల్ గా పెళ్లి చేసుకునేందుకు అడ్డంకులు ఉండటంతో ఇలా ఆ ముచ్చటని తెరమీద జరుపుకుంటున్నారు. వయసు మళ్ళాక రెండో వివాహం అవసరం గురించి వివరిస్తూనే ఆ జంట మనోభావాలను ఆవిష్కరించే ప్రయత్నం ఎంఎస్ రాజుగారు ఇందులో చేశారట. ఒకేసారి పుణ్యం పురుషార్థం దక్కించుకోవడమంటే ఇదే
This post was last modified on March 24, 2023 11:36 am
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…