చప్పుడు లేని చివరి శుక్రవారం

ఫిబ్రవరి నెల బాక్సాఫీస్ ముగింపు మరీ చప్పగా ముగిసిపోయింది. చెప్పుకోవడానికి రిలీజులైతే ఉన్నాయి కానీ దేనికీ కనీస ఓపెనింగ్స్ లేక ఇవాళ థియేటర్లు వెలవెలబోయాయి. కొత్త హీరో శరణ్ కుమార్ మిస్టర్ కింగ్ లో క్యాస్టింగ్ బలంగా ఉన్నప్పటికీ కంటెంట్ గురించి డివైడ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ ని వాడుకునేలా కనిపించడం లేదు. టైటిల్ పవర్ ఫుల్ అనిపించినా దానికి తగ్గ మ్యాటర్ ఉంటే కనీసం మౌత్ టాక్ ద్వారా అయినా మెల్లగా జనం థియేటర్లకు వచ్చేవాళ్ళు. సునీల్, మురళీశర్మ, వెన్నెల కిషోర్ లాంటి క్యాస్టింగ్ ఎంత ఉన్నా అసలైన కథానాయకుడే పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు

ఇక మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా వచ్చిన తమిళ డబ్బింగ్ మూవీ కోనసీమ థగ్స్ పరిస్థితి ఇంతకన్నా తీసికట్టుగా ఉంది. సీనియర్ కొరియోగ్రాఫర్ బృంద దర్శకురాలి అవతారం ఎత్తి తీసిన ఈ జైల్ ఎస్కేప్ డ్రామాలో సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించేలా నడిపించినప్పటికీ మొదటిసగం సహనానికి పరీక్ష పెట్టడంతో ఓవరాల్ గా కష్టమనే మాటే బయటికి వచ్చింది. అందులోనూ ప్రమోషన్ పరంగా కనీస శ్రద్ధ తీసుకోకపోవడంతో అసలిది వచ్చిందన్న సంగతి కూడా జనాలకు రిజిస్టర్ కాలేదు. దీంతో చాలా చోట్ల షోలు రద్దు చేసే దాకా వెళ్ళింది. పికప్ అయితే అద్భుతమే

ఇక డెడ్ లైన్ లాంటి చిన్నా చితకా సినిమాలేవో వచ్చాయి కానీ వాటి గురించి కనీస అటెన్షన్ లేదు. అక్షయ్ కుమార్ సెల్ఫీకి ముందు నుంచే అదోరకమైన నెగటివ్ వైబ్రేషన్స్ ఉండటంతో పబ్లిక్ దాని పట్ల ఆసక్తిగా లేరని దారుణంగా ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి. చూస్తుంటే సార్ మళ్ళీ పుంజుకోవడం ఖాయమే. గత మూడు రోజులు బాగా నెమ్మదించినప్పటికీ రేపు ఎల్లుండి మళ్ళీ జోరు చూపించడం ఖాయం. వినరో భాగ్యము విష్ణుకథ కూడా లాభపడే ఛాన్స్ లేకపోలేదు. శివరాత్రి తప్ప ఫిబ్రవరి నెల మొత్తం సోసోగానే గడిచిపోయి వీక్ క్లైమాక్స్ తో సెలవు తీసుకుంది.