విడుదల ఎప్పుడో ఖచ్చితంగా చెప్పడం లేదు కానీ నిర్మాణంలో ఉన్న రామ్ చరణ్ 15 మీద అంచనాలు అంతకంతా పెరిగిపోతున్నాయి. యూనిట్ ఎంత కట్టడి చేస్తున్నా లీకులు మాత్రం ఆగడం లేదు. కర్నూలు నుంచి వైజాగ్ దాకా ఎక్కడ అవుట్ డోర్ షూటింగ్ చేసినా ఆడియోతో సహా చిన్న చిన్న బిట్లు బయటికి వచ్చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో ఆస్కార్ వేడుకకు హాజరయ్యేందుకు చరణ్ ముందే ప్లాన్ చేసుకోవడంతో శంకర్ ఇండియన్ 2కి బ్రేక్ ఇచ్చి ఆర్సి కోసం ఎక్స్ ట్రా షెడ్యూల్స్ సెట్ చేసుకుని ఆమేరకు పూర్తి చేస్తున్నారు.
ఇక పాటల విషయంలోనూ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు కనిపిస్తోంది. తమన్ ఎప్పుడో సాంగ్స్ కంపోజింగ్ పూర్తి చేసి ఇచ్చేశాడు. ఆల్బమ్ లో ఉన్న అయిదు పాటలకు ఇండియాలోనే టాప్ 5 కొరియోగ్రాఫర్స్ ని శంకర్ తీసుకున్నారట. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరికీ ఫెవరెట్ గా మారిన జానీ మాస్టర్ ది మొదటి పేరు. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు ద్వారా గ్లోబల్ ఆడియన్స్ తో డాన్సులు చేయించిన ప్రేమ్ రక్షిత్ రెండో పేరు. బాలీవుడ్ నృత్యదర్శకుడు గణేష్ ఆచార్య థర్డ్ ఆప్షన్. చిరంజీవికి ఎన్నో సూపర్ హిట్స్ లో భాగమైన ప్రభుదేవా నాలుగో ఛాయస్. ట్రెండీకి మారుపేరుగా నిలిచే బాస్కో మార్టిస్ చివరి వ్యక్తి.
వీళ్ళందరికీ ఒక్కో పాట ఇచ్చారు. కేవలం సాంగ్స్ పిక్చరైజేషన్ కే 40 కోట్లకు పైగానే ఖర్చయ్యిందని ఇన్ సైడ్ టాక్. ఒక పెద్ద బడ్జెట్ సినిమాకయ్యేంత మొత్తం కేవలం వీటికే పెట్టారంటే శంకర్ ఏ విషయంలోనూ రాజీ పడలేదని అర్థమవుతోంది. ఎస్ జె సూర్య మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈ పొలిటికల్ ఎంటర్ టైనర్ లో అప్పన్నగా రామ్ నందన్ ఐఎఎస్ గా చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. కియారా అద్వానీ ఇటీవలే పెళ్లి చేసుకున్న కారణంతో తన కాంబోలో షూట్ చేయాల్సిన డ్యూయెట్ ని ఈ నెలాఖరులో ప్లాన్ చేసినట్టు తెలిసింది. దిల్ రాజు బ్యానర్ కిదే హయ్యెస్ట్ బడ్జెట్