ధనుష్ తో వెంకీ అట్లూరి తీస్తున్న తెలుగు , తమిళ్ బైలింగ్వల్ ‘సార్’ ఈ నెల 17న థియేటర్స్ లోకి రాబోతుంది. షూటింగ్ ఆలస్యం , రిలీజ్ వాయిదాలతో సినిమాపై ముందున్న మోస్తారు అంచనాలు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. మొన్నటి వరకు అసలు సార్ రిలీజ్ ఉంటుందా ? లేదా అనే అనుమానాలు ఉండేవి. తాజాగా చెన్నైలో ఆడియో లాంచ్ చేసి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయడంతో రిలీజ్ పై అందరికీ క్లారిటీ వచ్చేసింది.
అయితే తెలుగుకి సంబంధించి ఇంత వరకూ ఎలాంటి ప్రెస్ మీట్ కానీ ఈవెంట్ చేయలేదు మేకర్స్. దీంతో ఇక్కడ సినిమా కాస్త ఆలస్యంగా రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతుంది. అయితే మేకర్స్ మాత్రం అదే డేట్ కి తెలుగులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పోస్ట్ పోన్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. ఇక దనుష్ ఫస్ట్ టైమ్ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. కానీ తెలుగులో మాత్రంప్రమోషన్స్ కనిపించడం లేదు.
సితార వంటి సంస్థ నుండి వస్తున్న ఈ బైలింగ్వల్ సినిమా 17న వస్తుందని కూడా ప్రేక్షకులకు తెలియని పరిస్థితి. మరి చెన్నై లో సౌండ్ చేస్తే సరిపోతుందా ? తెలుగులో కూడా అదే రేంజ్ సౌండ్ కనిపించాలి కదా. పైగా తెలుగు నిర్మాత , దర్శకుడు తీసిన సినిమా. ఇక్కడ సౌండ్ లేకపోతే ఎలా ? ధనుష్ తో తెలుగులో ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తే తప్ప ‘సార్’ పై తెలుగులో అంచనాలు నెలకొనేలా లేవు.
This post was last modified on February 6, 2023 3:58 pm
బహు భాషా చిత్రాల నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.…
మా నాన్నకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? మాకు ఎప్పుడు న్యాయం లభిస్తుంది? అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ మర్రెడ్డి…
జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆ పార్టీ అదినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని…
నిజమే… ఈ విషయం విన్నంతనే.. ఈ సోకాల్డ్ ఆదునిక జనం నిత్యం పరితపిస్తున్న పోటీ… ఇద్దరు ముక్కు పచ్చలారని పిల్లల…
నిర్మాతగా నాని జడ్జ్ మెంట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో కోర్ట్ రూపంలో మరోసారి ఋజువైపోయింది. ప్రీమియర్లతో కలిపి తొలి…
జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…