షారుఖ్ ఖాన్ కెరీర్‌కు ‘పఠాన్’ సినిమా మామూలు ఊపునివ్వలేదు. ఓ మోస్తరు హిట్ కోసం దాదాపు పదిహేనేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు షారుఖ్. అలాంటిది అతడికి రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఇచ్చింది ‘పఠాన్’. యావరేజ్ కంటెంట్‌తోనే ఈ సినిమా తొలి రోజు నుంచి వసూళ్ల మోత మోగిస్తూ సాగింది. రెండు, మూడు వారాల్లో కూడా సినిమా జోరు తగ్గలేదు. దీని ధాటికి తర్వాతి వారాల్లో షెడ్యూల్ అయిన సినిమాలు గట్టి దెబ్బ తిన్నాయి. కొన్ని సినిమాలను వాయిదా కూడా వేసుకోవాల్సి వచ్చింది.
ఇలాంటి విజయాన్ని అందించినందుకు దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్, నిర్మాత ఆదిత్య చోప్రాలతో పాటు సల్మాన్ ఖాన్‌కు కూడా షారుఖ్ రుణపడి ఉన్నాడనే చెప్పాలి. సిద్దార్థ్, ఆదిత్య ఎంతో ప్లాన్ చేసి.. సుదీర్ఘ సమయం కష్టపడి ఈ సినిమా తీశారు. ఆదిత్య షారుఖ్ ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా భారీ బడ్జెట్ పెట్టాడు ఈ చిత్రంపై.
ఇక సల్మాన్ ‘పఠాన్’ మూవీకే హైలైట్ అనదగ్గ క్యామియో చేశాడు. సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది, హిందీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నది షారుఖ్-సల్మాన్ కలయికలో వచ్చే ఫన్నీ యాక్షన్ ఎపిసోడే. ఈ ఎపిసోడ్ చివర్లో నేను కష్టాల్లో ఉన్నపుడు కూడా నువ్వు రావాలి అని అంటాడు సల్మాన్. ఈ డైలాగ్‌తో పరోక్షంగా తన ‘టైగర్-3’ సినిమాలో షారుఖ్ క్యామియో గురించి చెప్పకనే చెప్పినట్లయింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో ఇప్పటికే కొన్ని స్పై యాక్షన్ సినిమాలు వచ్చాయి. అందులో రెండు సల్మాన్ చేసినవే. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలకు కొనసాగింపుగా ‘టైగర్-3’ రాబోతోంది. అది ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కాబోతోంది.
షారుఖ్, సల్మాన్ ఒకరి సినిమాల్లో ఒకరు క్యామియోలు చేయడం ఇది కొత్త కాదు. ఇప్పుడు ఆ ఒరవడిని కొనసాగిస్తూ ‘పఠాన్’లో మెరిశాడు సల్మాన్. అది బాగా వర్కవుట్ అయింది. ఇక షారుఖ్.. సల్మాన్‌తో పాటు ఆదిత్య రుణం తీర్చుకోవాల్సి ఉంది. ‘టైగర్-3’లో షారుఖ్ క్యామియో కూడా ఇలాగే హైలైట్‌గా నిలిచి, ఆ చిత్రం కూడా రికార్డ్ బ్రేకింగ్ హిట్టయి సల్మాన్ కెరీర్‌కు కూడా మంచి ఊపు తెస్తుందేమో చూడాలి.
This post was last modified on February 6, 2023 3:52 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…