వాళ్లిద్దరికీ ఆజన్మాంతం రుణపడి ఉంటాను : దాసరి కిరణ్ కుమార్

‘’ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి, ఎంపీ బాలశౌరి గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు, నిర్మాత దాసరి కిరణ్ కుమార్. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితుమైన దాసరి కిరణ్ కుమార్ కి ఆత్మీయ సన్మాన కార్యక్రమం తెనాలిలో జరిగింది. మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, బాపట్ల ఎంపి నందిగామ సురేశ్‌, సినీ దర్శకులు బాబి కొల్లి, త్రినాధరావు, మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దాసరి కిరణ్ మాట్లాడుతూ .. ఇది ఒక పదవి లా కాదు.. శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం శ్రీ జగన్ మోహన్ రెడ్డి రూపంలో దేవుడు నాకు ఇచ్చాడని భావిస్తున్నాను. శివన్నది చాలా మంచి మనసు. నాకు ఎంతో ఆప్తులు. ఆయన అద్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరగడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మంత్రి నాగార్జున అన్న ఈ వేడుకకు రావడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. అలాగే రమణ గారు, నందిగామ సురేష్ గారితో పాటు అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.