‘కాంతార’ సినిమా గత ఏడాది రేపిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ముందు కన్నడలో విడుదలై సెన్సేషనల్ హిట్టయిన ఈ చిత్రం.. ఆ తర్వాత ఇతర భాషల వాళ్లనూ ఆకర్షిస్తుండడంతో తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ అనువాదం చేసి రిలీజ్ చేశారు. తెలుగులో తొలి రోజు నుంచి సంచలన వసూళ్లతో దూసుకెళ్లిందీ చిత్రం. వరల్డ్ వైడ్ ఈ చిత్రం రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం ఒక సంచలనమే.
ఒక గ్రామీణ కథతో తెరకెక్కిన ప్రాంతీయ భాషా చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడం ఒక చరిత్ర. వసూళ్ల సంగతి పక్కన పెడితే ప్రేక్షకుల మీద ఈ సినిమా వేసిన ఇంపాక్ట్ చాలా బలమైనది, ప్రత్యేకమైంది. ముఖ్యంగా ఆ సినిమాలో భూత కోల నృత్యం.. దాని చుట్టూ నడిపిన ఘట్టాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అవి ప్రేక్షకులను ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లాయి. ఇప్పుడు చూసినా అవి ప్రత్యేక అనుభూతిని కలిగించే సన్నివేశాలే.
వెండితెరపై అద్భుతంగా రూపొందిన ఇవే సన్నివేశాలను నిజ జీవితంలో చూస్తే.. అది జరుగుతున్న చోట కాంతార టీం కూడా ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ వీడియోనే నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. కర్ణాటక గ్రామీణ ప్రాంతంలో వన దేవతల వేడుకలకు కాంతార టీంతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. వారి ముందే భూత కోల నృత్యకారుడు సంబంధిత మేకప్ వేసుకుని.. ఆ ప్రత్యేక నృత్యం చేశాడు.
ముఖ్యంగా భూత కోల నృత్యకారుడిగా హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి వెండితెరపై ఎంత గొప్పగా అభినయించాడో.. ఆ సన్నివేశాలను ఎంత గొప్పగా చిత్రీకరించాడో తెలిసిందే. అతడి ముందు అలాంటి మేకప్‌తో నిజ జీవిత భూత కోల నృత్యకారుడు అభినయించడం.. రిషబ్ తన్మయత్వంతో ఆ దృశ్యాన్ని చూడడం ఈ వీడియోలో స్పెషల్. నెటిజన్లు ఈ వీడియోను చూసి మైమరిచిపోతున్నారు. ఐతే ఇదంతా తాజాగా జరిగిందా.. సినిమా చిత్రీకరణకు ముందు టీం వారిని కలిసిందా అన్నదానిపై స్పష్టత లేదు.
This post was last modified on January 20, 2023 7:39 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…