‘వీరయ్య’ కంటే ‘వీరసింహారెడ్డి’ ఎక్కువ !

టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. సాంగ్స్ , పోస్టర్స్ తో ఎక్కడా చూసినా వీరయ్య , వీర సింహా రెడ్డి సినిమాల గురించే టాపిక్ నడుస్తుంది. ఇప్పటికే రిలీజ్ కి సంబంధించి అన్నీ పనులు పూర్తయ్యాయి. తాజాగా రెండు సినిమాలకు సెన్సార్ కూడా పూర్తయింది. రెండు సినిమాలు రన్ టైమ్ లాక్ చేసుకున్నాయి.

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు రెండు గంటల నలబై నిమిషాల రన్ టైమ్ లాక్ చేశారు. ‘వీర సింహా రెడ్డి’ కి ఏకంగా రెండు గంటల నలబై తొమ్మిది నిమిషాల (వితౌట్ యాడ్స్) రన్ టైమ్ లాక్ చేసుకున్నారు. రన్ టైమ్ పరంగా వీరయ్య కంటే వీర సింహా రెడ్డినే పది నిమిషాలు ఎక్కువ. అయితే ఈ రెండు సినిమాలకు క్రిస్ప్ రన్ కాకుండా కాస్త ఎక్కువ లెంగ్త్ ఫిక్స్ చేయడంతో కొత్త చర్చ నడుస్తుంది.

ఈ కమర్షియల్ సినిమాలకు రెండున్నర గంటలు కాకుండా మరో పది, ఇరవై నిమిషాలు ఎక్కువ తీసుకొని దర్శకులు బాబీ , గోపీచంద్ మాలినేని ప్రేక్షకులను ఇబ్బంది పెడతారా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. రన్ టైమ్ ఎక్కువ ఉండటం వల్ల ఈ మధ్య కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా బోర్ కొట్టించి థియేటర్స్ నుండి బయటికి పంపించాయి. వీరయ్య , వీర సింహా రెడ్డి లకు సంబందించి మేకర్స్ ఈ రన్ టైమ్ లాక్ చేసుకునే ముందు అవన్నీ ఆలోచించే ఉంటారు. ఫైనల్ గా కథ డిమాండ్ చేస్తే పరవాలేదు కానీ ఊరికే డ్రాగ్ చేసి లెంగ్త్ పెంచితే మాత్రం మొదటికే మోసం వస్తుంది.