నరేష్ పవిత్ర బంధం ఇక అఫీషియల్

టాలీవుడ్ లో అత్యంత రచ్చకెక్కిన లివ్ ఇన్ రిలేషన్ గా పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు Naresh క్యారెక్టర్ ఆర్టిస్ట్ Pavitra Lokesh ల బంధం అఫీషియల్ గా లాక్ అయిపోయింది. గతంలో వీళిద్దరి సాన్నిహిత్యం గురించి మీడియాలో జరిగిన రచ్చ, అతని మాజీ భార్య ఇద్దరినీ వెంటాడిన వీడియోలు వైరల్ కావడం ఇవన్నీ చాలా దూరం వెళ్లాయి. ఒకదశలో ఇంత అవసరమా అనిపించేలా కూడా కామెంట్స్ వచ్చాయి. వ్యవహారం ఎక్కడిదాకా వెళ్లిందంటే కొత్తగా రిలీజైన సినిమాల్లో ఈ జంట కనిపిస్తే చాలు థియేటర్లో నవ్వులు ఈలలు గోలలు వినిపించేంత. ఫైనల్ గా వీటన్నిటికి నరేష్ స్వయంగా చెక్ పెట్టారు.

అలా అని సింపుల్ గా కాదండోయ్. ట్విట్టర్ లో తన అఫీషియల్ హ్యాండిల్ ద్వారా ఒక వీడియో పోస్ట్ చేశారు. అక్కడ న్యూ ఇయర్ కేక్, పరస్పరం ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఆప్యాయంగా దగ్గరగా వచ్చి ఏకంగా లిప్ లాక్ కిస్సుతో తమ ఆనందాన్ని పీక్స్ కి తీసుకెళ్లడం ఇందులో చూపించేశారు. ఫక్తు సినిమా స్టైల్ లో మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు వెనకాల చిన్న సిజి ఎఫెక్ట్స్ తో వెరైటీగా సెట్ చేశారు. త్వరలో తమ పెళ్లని చెప్పేశారు. మరి నరేష్ కు తన పూర్వపు వివాహ సంబంధాలతో చట్టపరంగా అన్ని క్లియరెన్స్ లు వచ్చాయా లేదా అనేది క్లారిటీ లేదు కానీ మొత్తానికి ఇలా చెప్పడం మాత్రం విచిత్రమే.

సోషల్ మీడియాలో దీని మీద సహజంగానే పలు రకాల కామెంట్లు ట్రోల్స్ వస్తాయి. మాములుగా మాట్లాడుతూ ఏదైనా వీడియో పెడితే అది వేరే విషయం. సరే అయిపోయిందని అందరూ లైట్ తీసుకునేవారు. కానీ ఇలా అర్జున్ రెడ్డి రేంజ్ లో ఆధర చుంబనాలతో ప్రకటించడం మాత్రం నరేష్ మార్క్ స్టైల్ అనుకోవాలేమో. ఇండస్ట్రీలో ఎందరో హీరోలు హీరోయిన్లు యాక్టర్లు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి కానీ ఎవరూ ఇలా మాత్రం చెప్పలేదు. మొత్తానికి తమ బంధం ఎంత ధృడమో చెప్పేందుకు నరేష్ చేసిన ప్రయత్నం గురించి ఇంతకంటే ఏం చెప్పగలం.