Movie News

బండ్లన్న మాటలపై ఫ్యాన్స్ ఆగ్రహం

సినిమా ఫంక్షన్ ఏదైనా సరే బండ్ల గణేష్ స్టేజి ఎక్కితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. రచ్చ లేనిదే కిందకు రాడు. ఇది గుర్తుపెట్టుకుని దానికి సిద్ధపడే గెస్టుగా పిలుస్తుంటారు నిర్వాహకులు. ఆ మధ్య ఆకాష్ చోర్ బజార్ వేడుకలో డైరెక్ట్ గా హీరో తండ్రి పూరి జగన్నాధ్ మీద చేసిన కామెంట్లు ఎంత హాట్ టాపిక్ గా మారాయో చూశాం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫంక్షన్లలో మాత్రమే ఎక్కువగా కనిపించే బండ్లన్న మెల్లగా ఇతర వాటికి హాజరవుతున్నాడు. తాజాగా రవితేజ రీసెంట్ సూపర్ హిట్ ధమాకా సక్సెస్ మీట్ కి వచ్చి మరోసారి అలాంటి సీన్ రిపీట్ చేయబోయి ఫ్యాన్స్ గుస్సాకు కారణమయ్యాడు

స్పీచ్ లో భాగంగా మాట్లాడుతూ రవితేజ చాలా చిన్న స్థాయి నుంచి ఎన్నో చేసి కష్టపడి పైకొచ్చాడని ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చి పొగిడేశాడు. సరే ఇందులో తప్పేమి లేదు. నిర్మాతగా బండ్ల గణేష్ కు మొదటి అవకాశం ఆంజనేయులు రూపంలో ఇచ్చింది మాస్ మహారాజే. కాబట్టి ఆ సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు. అక్కడితో ఆగితే సరిపోయేది. ఎవరైనా సరే అదృష్టం ఉంటే సూపర్ స్టార్లు మెగాస్టార్లు అయిపోతారని చెప్పడంతో ఇది కాస్తా వేరే అర్థంలో సోషల్ మీడియాలో వెళ్లిపోయింది. దీంతో చిరంజీవి మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్కు ఉంటే ఆఫర్లు రావొచ్చేమో కానీ స్టార్లు ఎలా అవుతారనేది వాళ్ళ ప్రశ్న.

బండ్ల గణేష్ ఉద్దేశం ఏదైనా ఇప్పుడున్న హీరోల బిరుదులు వాడేయడంతో చిక్కొచ్చింది. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ లేకపోతే నెగ్గుకురాలేని పోటీ ప్రపంచంలో ఉత్తినే అదృష్టాన్ని నమ్ముకుని ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు. ఎవరైనా సరే కష్టపడాల్సిందే. అంతదాకా ఎందుకు పవన్ తో రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేయడం బండ్ల గణేష్ లక్కా అని నెటిజెన్లు రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడా వీడియోలే ట్విట్టర్లో చక్కర్లు కొడుతున్నాయి. అయినా చిన్నచిన్న వాటికే నానా యాగీ జరుగుతున్న రోజుల్లో ఇలా ఒళ్ళు మరిచి మాట్లాడితే ఎలా బండ్లన్నా అంటున్నారు ఫ్యాన్స్. నిజమేగా.

This post was last modified on December 30, 2022 12:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago