మొన్నామధ్య తమిళనాడులో బాబాని భారీ ఎత్తున రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వింతేమీ లేదు కానీ దానికి కూడా తెల్లవారుఝామున నాలుగు గంటలకు షోలు వేస్తే చాలా చోట్ల కిక్కిరిసిపోయి ఫ్యాన్స్ తో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. అసలు అంత పెద్ద డిజాస్టర్ కి ఈ రెస్పాన్స్ ఏంటా అని మీడియా సైతం ఆశ్చర్యపోయింది.
కట్ చేస్తే అదేమీ మన జల్సా, పోకిరి లాగా రికార్డులు పెట్టలేకపోయింది. కానీ డీసెంట్ రెవిన్యూతో ఫ్లాప్ మూవీకి ఈ మాత్రం రావడమే గొప్ప అది రజిని మేనియా ప్రభావమని చెప్పుకునేలా బయట పడింది. కట్ చేస్తే ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇదే ఫాలో అవుతున్నారు
ఎల్లుండి రిలీజ్ కాబోతున్న ఖుషికి మెయిన్ సెంటర్స్ లో సూర్యుడు పొద్దు పొడవకుండానే షోలు వేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో ఉదయం అయిదు నుంచి ఎనిమిది మధ్య ప్రీమియర్లు వేస్తుంటే అన్నీ ఆఫ్ లైన్ లోనే సోల్డ్ అవుట్ అవుతున్నాయి.
నమ్మశక్యం కాని విషయం ఏంటంటే వీటికి సైతం బ్లాక్ వెయ్యి దాకా నడుస్తోందట. క్రేజ్ చూసిన థియేటర్ యాజమాన్యాలు ఏకంగా వారం మొత్తం రోజు నాలుగు ఆటలతో స్క్రీనింగ్ చేసేలా అగ్రిమెంట్లు చేసుకున్నట్టు తెలిసింది. రీ రిలీజుల ట్రెండ్ డౌన్ అవుతున్న సమయంలో ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించేదే
ఇదంతా బాగానే ఉంది ఏదో ఒకటి రెండు రోజులకు అంటే పర్వాలేదు కానీ మరీ వారం మొత్తం జనాన్ని ఫుల్ చేసే కెపాసిటీ ఖుషికి ఉందా అనేది వేచి చూడాలి. ఎందుకంటే గతంలో జల్సాని రెండు మూడు రోజులకు పరిమితం చేసినా మంచి కలెక్షన్లు వచ్చాయి. పోకిరి కూడా అంతే. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి ఓకే అనిపించింది. ఆపై ఇంకేవి వీటిలో సగం కూడా అందుకోలేదు. మరి ఖుషిని మీద ఇంత బజ్ నడుస్తోందంటే చిన్న విషయం కాదు. అసలే ఈ శుక్రవారం మార్కెట్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో ధమాకా తర్వాత మూవీ లవర్స్ ఛాయస్ ఖుషినే అవుతోంది. అందుకే ఈ రచ్చ