ఫ్లాష్ బ్యాక్ : రజినీతో పవన్ ను పోల్చిన ఖుషి నిర్మాత

పవర్ స్టార్ Pawan Kalyan క్రేజీ మూవీ ‘ఖుషి’ సినిమాను డిసెంబర్ 31 న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఏ ఎం రత్నం ఖుషి తెరవెనుక కథలు పంచుకున్నాడు.

నిజానికి ఖుషి కథ Sj Suryaయ నాకు వినిపించగానే మొదటిగా పవన్ కళ్యాణ్ గారికే చెప్పాను. పవన్ కళ్యాణ్ -అమీషా పటేల్ ఓపెనింగ్ కూడా చేసేశాం. కానీ ఆ టైమ్ లో కళ్యాణ్ గారు బద్రి సినిమాతో బిజీగా ఉండటం వల్ల ముందుకు తమిళ్ లో స్టార్ట్ చేశాం. అక్కడ మొదట ముద్దు అనే టైటిల్ చెప్పాడు సూర్య. కానీ ఆ టైటిల్ వద్దని మహిళలు థియేటర్ కి వెళ్ళి ముద్దు కి టికెట్ ఇవ్వమని అడిగితే బాగోదని చెప్పి మరో టైటిల్ చెప్పమన్నాను.

అప్పుడు Kushi టైటిల్ చెప్పాడు సూర్య. అక్కడ ఖుషి కంప్లీట్ చేశాక ఇక్కడ పవన్ గారితో చేశాం. అప్పుడు కళ్యాణ్ గారు ఖుషి టైటిల్ బాగుందని తెలుగులో కూడా అదే పెట్టేయమని చెప్పారు.

Producer AM Ratnam Exclusive Interview | Kushi Teravenuka Kathalu | Pawan Kalyan

ఇక అమీషా పటేల్ ఆ టైమ్ లో బాలీవుడ్ లో బాగా బిజీ గా ఉంది. ఎంత ప్రయత్నించిన ఆమె డేట్స్ దొరకలేదు. అందుకే ఆమె ప్లేస్ లో అప్పుడే యువకుడు సినిమాతో పరిచయమైన భూమిక ను తీసుకున్నాం.

ఇక సినిమాలో కళ్యాణ్ గారు చేసిన లల్లూ అంకుల్ మాలుం అనే యాక్షన్ సీక్వెన్స్ కి మంచి రెస్పాన్స్ చేసింది. అదంతా కళ్యాణ్ గారే డిజైన్ చేశారు. రిలీజ్ తర్వాత సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఇండియాలో ఇద్దరు సూపర్ స్టార్స్ Rajinikanth , పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరికీ వారి సినిమా ఎలా ఉండాలో బాగా తెలుసని స్టేట్ మెంట్ ఇచ్చాను. ఆడియన్స్ పల్స్ తెలిసిన హీరోల్లో ఒకరు రజినీ కాంత్ మరొకరు కళ్యాణ్ అంటూ చెప్పుకున్నారు.