టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మధ్య తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆయన మాటలు.. చర్యలు కాంట్రవర్శీలకు కారణం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా నైజాం ఏరియాలో సంక్రాంతికి భారీ అంచనాల మధ్య రిలీజవుతున్న తెలుగు చిత్రాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లకు దీటుగా.. తన నిర్మాణంలో వస్తున్న అనువాద చిత్రం ‘వారసుడు’ థియేటర్లు కేటాయిస్తుండటం పట్ల రాజు తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఈ విషయంలో ఆయన వివరణ ఎలా ఉన్నప్పటికీ విమర్శలు ఆగట్లేదు. ఇంతలో దిల్ రాజు తమిళ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ స్టార్ ఎవరనే విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అక్కడి అభిమానుల మధ్య చిచ్చు పెట్టడం చర్చనీయాంశం అవుతోంది. తమిళంలో విజయే నంబర్ వన్ హీరో అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంతే కాక ‘వారసుడు’ సినిమాకు.. అజిత్ మూవీ ‘తునివు’తో పోలిస్తే ఎక్కువ థియేటర్లు ఇవ్వాలంటూ తాను అడగబోతున్నట్లు చెప్పారు.
ఐతే తమిళంలో నంబర్ వన్ హీరో ఎవరనే విషయంలో ప్రస్తుతం ఏకాభిప్రాయం లేదు. ఒకప్పుడైతే సూపర్ స్టార్ రజినీకాంత్ ముందు ఎవరూ నిలిచేవారు కాదు. కానీ గత కొన్నేళ్లలో విజయ్, అజిత్ ఆయన్ని మించి ఎదిగిపోయారు. వసూళ్ల పరంగా విజయ్ కొంచెం పైచేయి సాధించినా.. అజిత్‌ను తక్కువ చేయలేం. ‘విశ్వాసం’ లాంటి రొటీన్ మాస్ మూవీతో అతను ఇండస్ట్రీ కొట్టాడు. గత ఏడాది విజయ్ సినిమా ‘బీస్ట్’ తుస్సుమనిపిస్తే.. డివైడ్ టాక్‌తోనూ అజిత్ మూవీ ‘వలిమై’ బ్లాక్‌బస్టర్ అయింది. అందుకే విజయ్ నంబర్ వన్ అంటే అజిత్ అభిమానులు అస్సలు ఊరుకోరు.
ఇప్పటికే విజయ్, అజిత్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ పీక్స్‌లో ఉన్నాయి. సోషల్ మీడియాలో వారి గొడవలు శ్రుతి మించిపోతున్నాయి. ఇలాంటి టైంలో విజయే నంబర్ వన్, అజిత్ సినిమా కంటే విజయ్ చిత్రానికి ఎక్కువ స్క్రీన్లు ఇవ్వాలి అంటూ దిల్ రాజు స్టేట్మెంట్ ఇవ్వడం అంటే అభిమానుల మధ్య గొడవను పెంచినట్లే. ఆయన తెలుగులోనే ఈ మాటలు అన్నప్పటికీ ఈ సోషల్ మీడియా కాలంలో ఆ వ్యాఖ్యలు తమిళ అభిమానుల వరకు వెళ్లకుండా ఉండవు. అందులోనూ ‘వారిసు’ మూవీ నిర్మాతగా రాజు పేరు తమిళ జనాల నోళ్లలో నానుతోంది. ఒక పెద్ద నిర్మాత ఇలా ఫలానా హీరో నంబర్ వన్ అని స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది కరెక్టేనా అన్న చర్చ నడుస్తోంది. ఇలా రాజు కోరి ఎందుకు వివాదాలు తెచ్చుకుంటున్నారన్నది అర్థం కాని విషయం.
This post was last modified on %s = human-readable time difference 2:36 pm
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
రాజకీయాల్లో తప్పొప్పులు అనేవి ఉండవు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయకుడికి… తదుపరి అదే పనిని తన ప్రత్యర్థి…