ఆ కుర్ర డైరెక్టర్ పని బాగుంది!

ఇటీవల తెలుగు కమర్షియల్ సినిమాలపై సెటైర్ వేసి స్టార్ హీరోల అభిమానుల ఆగ్రహం చవిచూసిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని వెంకటేష్ తో చేయబోతున్నాడు. కరోనా విపత్తు వల్ల వెంకటేష్ షెడ్యూల్స్ డిస్టర్బ్ అవడంతో ఆ చిత్రం మొదలు కావడానికి మరింత సమయం పడుతుంది. అందుకే ఈలోగా తరుణ్ భాస్కర్ వేరే పనులతో బిజీ అవుతున్నాడు.

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు డైరెక్ట్ చేసి, సడన్ గా నటన వైపు దృష్టి మరల్చిన తరుణ్ భాస్కర్ మంచి రచయిత కూడా. అందుకే అతనితో ఓ మై కడవులే చిత్రానికి మాటలు రాయించుకుంటున్నారు. ఇందుకోసం తరుణ్ కి భారీ పారితోషికమే ఇచ్చినట్టు భోగట్టా. మాములుగా డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఇక అదే పని మీద ఉంటారు కానీ, తరుణ్ మాత్రం ప్రతి కథ రాయడానికి తగినంత సమయం తీసుకుంటాడు.

అయితే ఈలోగా సమయం వృధా చేయకుండా అటు నటిస్తూ, ఇటు సంభాషణలు కూడా రాస్తూ అటు క్రియేటివ్ గా యాక్టివ్ గా ఉంటూ, ఇటు క్యాష్ ఇన్ ఫ్లో కూడా ఉండేట్టు చూసుకుంటున్నాడు.