ఆచార్య డిజాస్టర్ తర్వాత బయట ఎక్కడా కనిపించకుండా మొన్నీమధ్య ఎన్టీఆర్ 30 తాలూకు పనుల ఫోటోల్లో కనిపించిన కొరటాల శివ ఇవాళ ఒక ఈవెంట్ కు అతిథిగా హాజరవ్వాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో రానని చెప్పడం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఏ దర్శకుడికైనా ఫ్లాపులు సహజమేనని అంతమాత్రాన ఇలా మొహం చాటేసి మరీ తప్పించుకుపోవాల్సిన అవసరం ఏమిటని కొన్ని కథనాలు వచ్చాయి. కొందరు ఏకంగా తారక్ ప్రాజెక్టుకు ఏమైనా చిక్కు పడిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కారణం ఏదైనా కొరటాల చేసింది ఒక రకంగా రైటే. అదెందుకో చూద్దాం.
నిజమే. డిజాస్టర్లు ఎవరికైనా వస్తాయి. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన అనుభవమున్న దాసరి నారాయణరావుగారు రెండో తరం అతి పెద్ద స్టార్లు చిరంజీవి బాలకృష్ణలకు దారుణమైన ఫ్లాపులు ఇచ్చారు. అవి లంకేశ్వరుడు, పరమవీరచక్ర. వీళ్ళతో అయన చేసింది ఇవే. అంతకు ముందు ఆ తర్వాతా లేవు. దానికి దాసరి గారు కుంగిపోలేదు. మళ్ళీ కంబ్యాక్ అయ్యారు. చిన్న సినిమాలతోనూ పెద్ద హిట్లు కొట్టారు. ఇంకా చాలా ఉదాహణలు ఉన్నాయి కానీ కొరటాల విషయానికి వద్దాం. ఆచార్య పోయింది. అది గడిచిపోయిన గతం. ఇప్పుడు తన ఫోకస్ మొత్తం తారక్ ప్యాన్ ఇండియా మూవీ మీదే ఉంది.
ఇప్పుడు ఏ సందర్భంలో బయటికి వచ్చినా మీడియా ఎక్కడో ఒక చోట పట్టేసుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. సమాధానం చెప్పడం కష్టమేమి కాదు కానీ లేనిపోనివి అడిగి దాన్ని మసాలా కంటెంట్ గా యుట్యూబ్ థంబ్ నెయిల్స్ గా మార్చుకునే అవకాశం చాలా ఉంది. మొన్న ఆలీ ఇంటర్వ్యూలో మణిశర్మ అన్న మాటలకే ట్విట్టర్ లో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ఇవన్నీ గమనించే కొరటాల శివ ముందు షూటింగ్ స్టార్ట్ చేసి అది కొంత భాగం అయ్యాక అప్పుడు ఓపెన్ అయితే బాగుంటుందనే ఆలోచన చేసిన్నట్టున్నారు. అయితే అదేదో వీలైనంత తొందరగా చేయమని కోరుతున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్.
This post was last modified on December 4, 2022 10:42 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్‌లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…