అడివి శేష్ ఇప్పుడు మామూలు ఉత్సాహంలో లేడు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలతో వరుసగా హిట్లు కొడుతున్న అతడికి.. ‘హిట్-2’ మరో ఘనవిజయాన్ని అందించేలా కనిపిస్తోంది. ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. వర్డ్ ఆఫ్ మౌత్, సోషల్ మీడియా పబ్లిసిటీ కూడా కూడా బాగా ప్లస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం రూ.11 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. శేష్ కెరీర్లో ‘హిట్-2’ తెలుగు వరకు బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
‘హిట్-2’ను త్వరలోనే హిందీ, ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. అక్కడా సక్సెస్ అయితే ‘మేజర్’ కలెక్షన్లను కూడా దాటేస్తుందేమో. ‘హిట్-2’కు సూపర్ రెస్పాన్స్ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు శేష్.
ఈ సందర్భంగా ‘హిట్-2’ సక్సెస్ గురించి మహేష్ బాబు తనతో మాట్లాడిన సంగతి వెల్లడించాడు శేష్. ‘‘రిలీజ్ రోజు ఉదయం మహేష్ గారు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడారు. నా విషయంలో చాలా ప్రౌడ్‌గా ఉన్నానని చెప్పారు. ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చేశాయి. ఒక సోదరుడిగా నాకు ఎప్పటికీ తోడుగా ఉంటానని ఆయనకు మాటిచ్చా. ఆయనకు ‘హిట్-2’ చూపించాలని ఆశగా ఉన్నా’’ అని శేష్ తెలిపాడు. ‘హిట్’ తర్వాతి సినిమాలో మహేష్ బాబును హీరోగా పెట్టండని ఒక అభిమాని అనగా.. ఆయనకు ఈ సినిమా సూటవుతుందో లేదో ఆలోచించాలని చెప్పాడు శేష్.
‘హిట్-2’ సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని అడిగితే.. ‘‘నేను, నాని, విశ్వక్సేన్, శైలేష్ కలిసి ‘హట్‌వర్స్’లో తర్వాత ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకున్నాం. అలాగే టీం అంతా కలిసి డ్యాన్స్ చేశాం’ అన్నాడు శేష్. ‘హిట్-2’ను ఈ నెల చివర్లో హిందీలో రిలీజ్ చేద్దామనుకుంటున్నామని.. అక్కడ తనే డబ్బింగ్ కూడా చెప్పుకుంటానని.. ‘మేజర్’ సినిమా సక్సెస్ నేపథ్యంలో ఈ సినిమా కోసం అక్కడి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అతనన్నాడు.
This post was last modified on December 4, 2022 10:38 am
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…