టాలీవుడ్లో మంచి టాలెంట్ ఉన్న యువ నటుల్లో సత్యదేవ్ ఒకడు. ఇటీవలే ‘గాడ్ ఫాదర్’ సినిమాతో అతడి ప్రతిభ ఎలాంటిదో అందరికీ తెలిసింది. అందులో పెర్ఫామెన్స్ పరంగా చిరునే డామినేట్ చేశాడంటే తన టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నెగెటివ్ అనే కాక క్యారెక్టర్ రోల్స్‌లోనూ అదరగొడుతున్న సత్యదేవ్‌కు సోలో హీరోగా మాత్రం బ్రేక్ రావట్లదు.
ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసి విఫలమైన అతను.. ఇప్పుడు ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. తమన్నా లాంటి పెద్ద హీరోయిన్ ఇందులో ఒక కథానాయికగా నటించింది. మేఘా ఆకాశ్‌తో పాటు మరో కొత్తమ్మాయి ఇందులో సత్యదేవ్‌తో రొమాన్స్ చేసింది. ఈ నెల 9న ‘గుర్తుందా శీతాకాలం’ థియేటర్లలోకి దిగబోతున్న నేపథ్యంలో రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేశారు. అది చూస్తే ఇది ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ మూవీ అనిపిస్తోంది.
ఆటోగ్రాఫ్, ప్రేమమ్, థాంక్యూ సహా చాలా చిత్రాలను గుర్తు చేసేలా ఉంది ‘గుర్తుందా శీతాకాలం’. ఒక కుర్రాడి స్కూల్ ఏజ్ నుంచి మొదలుపెట్టి 30 ఏళ్ల వయసు వచ్చే వరకు వివిధ దశల్లో వేర్వేరు అమ్మాయిలతో అతడి రొమాంటిక్ లైఫ్‌ను చూపించే చిత్రంలా ఇది కనిపిస్తోంది. లైన్ పరంగా పైన చెప్పుకున్న సినిమాలతో పోలిక ఉన్నా.. నరేషన్ కొంచెం భిన్నంగా ఉండేలా ఉంది.
ఇంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్లో ఫన్ డోస్ పెద్దగా కనిపించలేదు. ఫీల్, ఎమోషన్ మీదే దృష్టిపెట్టలేదు. కానీ రిలీజ్ ట్రైలర్ మాత్రం సరదా సరదాగా సాగిపోయింది. ఫన్, రొమాన్స్ రెండూ ఉన్న యూత్ ఫుల్ మూవీ ఇదనే సంకేతాలు ఇచ్చారు. ముగ్గురమ్మాయిలతో హీరో రొమాంటిక్ సీన్లను కూడా చూపించారు. అందర్లోకి ఆటోమేటిగ్గా తమన్నానే హైలైట్ అయింది.
కారణాలేంటో కానీ ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్న తమన్నా..డబ్బింగ్ కూడా చెప్పినట్లు లేదు. ఈ మధ్య చాలా సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. ఈ చిత్రంలో మాత్రం ఆమెకు వేరెవరో డబ్బింగ్ చెప్పారు. ఆ సంగతి పక్కన పెడితే కన్నడ హిట్ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా నాగశేఖర్ అనే దర్శకుడు రూపొందించిన ఈ రొమాంటిక్ మూవీ అయినా సత్యదేవ్‌కు సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.
This post was last modified on December 4, 2022 8:22 am
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…