మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నదమ్ములే అయినప్పటికీ.. వారు ఎప్పుడో ఒకసారే కలుస్తుంటారు కాబట్టి వారి కలయిక అమితాసక్తిని రేకెత్తిస్తుంటుంది. తాజాగా చిరు తన కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ చిత్రీకరణలో ఉండగా అక్కడికి పవన్ కూడా వచ్చాడు. తన ‘హరి హర వీరమల్లు’ సినిమా కూడా సమీపంలోనే చిత్రీకరణ జరుపుకుటుండడంతో చిరును కలవడానికి వచ్చాడు పవన్. ఈ సందర్భంగా అన్నదమ్ములు ముచ్చటించుకుంటున్న ఫొటోలు బయటికి వచ్చాయి.
‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఒక పాటను పవన్‌ను చిరు చూపిస్తున్న దృశ్యం కూడా కనిపించింది. ఐతే ఈ ఫొటోలో చిరు, పవన్‌లను మించి ఓ వ్యక్తి హైలైట్ అయ్యారు. ఆయన ఎవరో కాదు.. దర్శకుడు క్రిష్. ఈ దర్శకుడు అంతగా అందరి దృష్టినీ ఆకర్షించడానికి కారణం ఆయన కొత్త లుక్కే.
కెరీర్ ఆరంభంలోనే క్రిష్‌కు నెత్తిన జుట్టు తక్కువగా కనిపించింది. కొన్నేళ్లకు మొత్తం బట్టతల వచ్చేసింది. ఐతే పెళ్లి చేసుకుంటున్న సమయంలో కూడా నెత్తిన జుట్టు లేకపోవడంపై క్రిష్ పెద్దగా పట్టించుుకన్నది లేదు. గత కొన్నేళ్లలో పూర్తిగా బాల్డ్ హెడ్‌లోకి వచ్చేశాడు క్రిష్. వయసు మరీ ఎక్కువ కాకపోయినా అంతలోనే ఇంత బట్టతల రావడం ఎవరికైనా బాధ కలిగించేదే. ఐతే క్రిష్ ఇలాంటివి పెద్దగా పట్టించుకునేలా కనిపించడు. కానీ ఇప్పుడు ఆయన ఆలోచన మారినట్లుంది. చాలామంది లాగే ఆయన కూడా నెత్తిన జుట్టు పెట్టించుకున్నాడు.
ఎప్పుడూ బట్టతలతో కనిపించే క్రిష్.. నెత్తిన ఫుల్లుగా నిగనిగలాడే జుట్టుతో కనిపించేసరికి చాలామంది ఆయన్ని గుర్తు పట్టలేకపోయారు ముందు. తర్వాత నెమ్మదిగా పోల్చుకుని క్రిష్ ఏంటి ఇలా తయారయ్యాడు అనుకున్నారు. ఎన్నడూ లేనిది క్రిష్ ఇలా హెయిర్ సెట్ చేసుకోవడంతో ఆయన వ్యక్తిగత జీవితంలో కొత్త మార్పులేమైనా వచ్చాయా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.
Gulte Telugu Telugu Political and Movie News Updates