తమన్ కెరీర్ లో బెస్ట్ మ్యూజిక్ లిస్టు లో ‘అఖండ’ ఒకటి. ఈ సినిమా కోసం తమన్ ప్రాణం పెట్టి వర్క్ చేశాడు. బాలయ్య తనకి పూనకం తెప్పించాడని అందుకే స్కోర్ ఆ లెవెల్ లో ఇచ్చానని చాలా సార్లు తమన్ చెప్పుకున్నాడు. అఖండ కి బ్యాక్ స్కోర్ ఎంత హెల్ప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అలాగే సాంగ్స్ కూడా పాపులర్ అయ్యాయి. బాలయ్య అంటూ తమన్ కంపోజ్ చేసిన సాంగ్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పటికీ చాలా పబ్బుల్లో ఈ సాంగ్ పడకుండా పార్టీ క్లోజ్ అవ్వని పరిస్థితి.
ఇప్పుడు బాలయ్య -తమన్ కాంబోలో ఇంకో సినిమా వస్తుంది. ‘వీరసింహా రెడ్డి కి తమన్ మ్యూజిక్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే టీజర్, టైటిల్ మోషన్ పోస్టర్ కి తనదైన స్కోర్ ఇచ్చి మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాడు తమన్. అయితే ఈ సినిమా సాంగ్స్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జై బాలయ్య అనే సాంగ్ లీక్ అయింది. ఆ సాంగ్ బయటికొచ్చాక మళ్ళీ మళ్ళీ వింటూ పాపులర్ చేసేందుకు ఫ్యాన్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ కూడా రెడీ గా ఉన్నారు.
సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాకు తమన్ బెస్ట్ వర్క్ ఇచ్చి ఉంటాడని అదిరిపోయే సాంగ్స్ కంపోజ్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. మరి తమన్ అండ్ టీం సాంగ్స్ రిలీజ్ చేయడమే ఆలస్యం. ప్రస్తుతం ఈ సినిమా గురించి తమన్ ఎప్పుడెప్పుడు అప్ డేట్ తో ట్వీట్ చేస్తాడా ? అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Gulte Telugu Telugu Political and Movie News Updates