మ‌మ్ముట్టితో జ్యోతిక‌.. ఒక ప్రేమ‌క‌థ‌

2000కు అటు ఇటుగా త‌మిళ సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక జ్యోతిక‌. సిమ్రాన్ త‌ర్వాత కొన్నేళ్ల పాటు ఆమే నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొన‌సాగింది అక్క‌డ‌. తెలుగులోనూ చిరంజీవి, నాగార్జున లాంటి టాప్ స్టార్ల‌తో ఆమె సినిమాలు చేసింది. కెరీర్ ఊపు త‌గ్గుతున్న టైంలో త‌మిళ స్టార్ హీరో సూర్య‌ను పెళ్లి చేసుకుని ఒక ఉత్త‌మ‌మైన గృహిణి పాత్ర‌లోకి మారిపోయింది జ్యోతిక‌. కోలీవుడ్లో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో వీళ్లిద్ద‌రికీ చోటుంది.

పిల్ల‌ల్ని క‌ని కొన్నేళ్ల పాటు కుటుంబ బాధ్య‌త‌ల‌కే ప‌రిమితం అయిన జ్యోతిక కొన్నేళ్ల కింద‌ట 36 వ‌య‌దినిలే అనే మంచి సినిమాతో పున‌రాగ‌మ‌నం చేసింది. ఆ త‌ర్వాత మ‌రికొన్ని చిత్రాల్లో న‌టించింది. ఐతే రీఎంట్రీలో వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ వ‌చ్చిన ఆమె.. ఇప్పుడో పెద్ద హీరో ప‌క్క‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఆ హీరో ఎవ‌రో కాదు.. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి.

క‌థానాయిక‌గా మంచి ఊపులో ఉండ‌గా మ‌మ్ముట్టికి జోడీగా న‌టించ‌ని జ్యోతిక‌.. కెరీర్లో ఈ ద‌శ‌లో ఈ లెజెండ‌రీ న‌టుడి సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. వీరి క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న చిత్రానికి కాద‌ల్ అనే టైటిల్ పెట్టారు. అంటే ప్రేమ అని అర్థం. ఫ‌స్ట్ లుక్ కూడా లాంచ్ చేయ‌గా.. అందులో ఒక నోస్టాల్జిక్ ఫీల్ క‌నిపిస్తోంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఫొటోలో మ‌మ్ముట్టి-జ్యోతిక చాలా ల‌వ‌బుల్‌గా క‌నిపిస్తున్నారు. ఫ‌స్ట్ లుక్ చూస్తే ఒక క్లాసిక్ ఫీలింగ్ క‌లుగుతోంది.

జియో బేబీ అనే ద‌ర్శ‌కుడు త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మ‌మ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ నిర్మిస్తుండ‌డం మ‌రో విశేషం. మ‌మ్ముట్టి, జ్య్ఓతిక తెలుగు వారికి కూడా బాగానే ప‌రిచ‌యం కాబ‌ట్టి ఈ సినిమా ఆటోమేటిగ్గా తెలుగులో కూడా రిలీజ్ కావ‌డం ప‌క్కా. మ‌రి ఈ సినిమాతో మ‌మ్ముట్టి-జ్యోతిక జోడీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.