ఇంతకీ ‘పుష్ప’ మొదలవుతోందా? లేదా?

అక్టోబర్ 1న ”అల్లూ స్టూడియోస్” మెగా లాంచ్ అంటూ ముందునుండి వినబడిన రూమర్లన్నీ నిజమయ్యాయ్. మెగాస్టార్ చిరంజీవి చీఫ్‌ గెస్టుగా ఆ కార్యక్రమాన్ని అల్లు అరవింద్ సక్సెస్ ఫుల్ గానే చేశారు. అయితే ఈ న్యూస్ తో పాటు వచ్చిన మరో న్యూస్ ఏంటంటే.. ఆల్రెడీ అల్లు స్టూడియోస్ ప్రాంగణంలో రెండు స్టూడియో ఫ్లోర్స్ కట్టేశారు కాబట్టి, అందులో ఒకదానిలో ”పుష్ప 2” కోసం సెట్స్ వేశారనే టాక్ వినిపించింది. పైగా స్టూడియో ఓపెనింగ్ అయిన రెండో రోజు నుండే షూటింగ్ కూడా మొదలవుతోంది అన్నారు. ఇంతకీ అదేమైంది?

నిజానికి అల్లూ స్టూడియోస్ ఓపెనింగ్ మీట్ లో అసలు క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ ఎక్కడా కనిపించలేదు. అఫ్‌ కోర్స్.. కేవలం తాము అవార్డు ఇచ్చిన సెలబ్రిటీలను మాత్రమే అక్కడకు పిలిచుంటారు అనుకుందాం. కాని ప్రస్తుతం సినిమాను చేస్తున్న సుకుమార్ ను తప్పకుండా పిలిచే ఉంటారుగా. ఏమైందో తెలియదు కాని, సుకుమార్ అక్కడ కనిపించకపోవడం, అలాగే సుకుమార్ తీస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ ఇంకా మొదలవ్వకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. ఇకపోతే ఒక తాజా అప్డేట్ ఏంటంటే.. పుష్ప 2 మొదలవ్వడానికి ఇంకాస్త టైమ్ పడుతుందట. దసరా పండుగ పూర్తయిన తరువాతనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారని అంటున్నారు. అప్పటివరకు సుకుమార్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటాడట.

ఒకవైపు అల్లు అర్జున్ కూడా పుష్ప 2 ఇంకా మొదలవ్వలేదు కాబట్టి, చక్కగా యాడ్స్ షూట్ చేసుకుంటున్నాడు. పస్తుతం త్రివిక్రమ్ డైరక్షన్లో జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ యాడ్ చేస్తున్నాడట. ఆ తరువాత మరో పెద్ద బ్రాండ్ కోసం కూడా షూటింగ్ చేసే ఛాన్సుంది.