వ్యవస్థను శాశించే పొలిటికల్ ఫాదర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ ట్రైలర్ కోసం అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. ప్రమోషన్లు అంతంత మాత్రంగా అనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాయలసీమ ప్రాంతాన్ని ఎన్నుకుని గ్రాండ్ గా జరిపిన వేడుకలో ఎట్టకేలకు లాంచ్ జరిగిపోయింది. హైప్ పెరగడం తగ్గడం పూర్తిగా దీని మీదే ఆధారపడిన తరుణంలో ఇది ఎలా ఉండబోతోందన్న యాంగ్జైటీ సగటు మూవీ లవర్స్ లోనూ ఉంది. ఆచార్య తాలూకు గాయాలను పూర్తిగా మాన్పుతుందన్న ఫ్యాన్స్ నమ్మకాన్ని ఇది నిలబెట్టాలని మెగా ఫ్యాన్స్ కోరుకున్నారు.

ఒరిజినల్ మలయాళం వెర్షన్ ఆల్రెడీ ఓటిటిలో ఉంది కాబట్టి ఈ వీడియోలో కథను దాచే ప్రయత్నం ఏదీ చేయలేదు. రూలింగ్ పార్టీ జన జాగృతి పార్టీకి చెందిన ముఖ్యమంత్రి చనిపోతే ఆ కుర్చీ మీద అందరి కళ్ళు పడతాయి. కానీ ఆ పదవి దుష్టుల పరం కాకుండా చూసేందుకు రంగంలోకి దిగుతాడు బ్రహ్మ(చిరంజీవి). సిఎం కుటుంబంలో ముసలానికి కారణమైన అల్లుడి(సత్యదేవ్)భరతం పట్టడంతో పాటు తన చెల్లెలి(నయనతార)ని చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాడు. ఈ మధ్యలో ఎన్నో నాటకీయ పరిణామాలు, జైలుకు వెళ్లే సంఘటనలు, కుట్రలు కుతంత్రాలు వెరసి గాడ్ ఫాదర్. .

మొత్తానికి ఫ్యాన్స్ ఏది కోరుకున్నారో దాన్ని కంప్లీట్ గా ఎలివేషన్స్ ప్యాకేజ్ తో ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు మోహన్ రాజా. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెర్రిఫిక్ కాదు కానీ విజువల్స్ కు తగ్గట్టు సింక్ అయ్యేలా సాగింది. కీలకమైన ఎపిసోడ్లను పెద్దగా మార్పులు లేకుండానే చేసినట్టు కనిపిస్తోంది. లూసిఫర్ లో ఉన్న టోవినో థామస్ పాత్ర తీసేశారనే టాక్ నిజమే. పూరి జగన్నాధ్ లాంటి ఒకరిద్దరిని తప్ప అందరిని రివీల్ చేశారు. చివరిలో సల్మాన్ ఖాన్ చిరుల స్టెప్పులు, యాక్షన్ బిట్లు అదనపు బోనస్. లక్ష్మి భూపాల డైలాగులు పేలాయి. మొత్తానికి గాడ్ ఫాదర్ అంచనాలకు తగ్గట్టుగానే అనిపిస్తోంది మరి.