అనుష్క బంగారం.. రూమర్లు నమ్మకండి!

నిశ్శబ్ధం చిత్రానికి అనుష్క ఇబ్బందులు కలిగిస్తోందనే పుకార్లు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. అనుష్క ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి వదంతులు వినలేదు. కొత్తగా ఆమె ఇప్పుడు స్టార్ లా బిహేవ్ చేస్తోందంటే నమ్మడానికి లేదు. అదే మాట ఆ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా చెప్పింది.

ఈ సినిమాపై వినిపిస్తోన్న పుకార్లు నమ్మవద్దని, అనుష్క సహకారం మరచిపోలేనిదని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇకపోతే లాక్ డౌన్ కారణంగా రిలీజ్ ఆగిపోయిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వేసవి సీజన్లో విడుదల చేద్దామని నెమ్మదిగా పని పూర్తి చేసారు. తీరా రిలీజ్ కి దగ్గర పడేసరికి కరోనా కాటేసింది.

దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అదంతా నిజం కాదని, పరిస్థితులు చక్కబడ్డాక థియేటర్స్ లో రిలీజ్ అవుద్దని ధృవీకరించారు.