విజయ్ దేవరకొండతో ‘సీతారామం’..డైరెక్టర్ క్లారిటీ !

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూసి మంచి కలెక్షన్స్ అందించిన సినిమాల్లో ‘సీతారామం’ మొదటి స్థానంలో ఉంటుంది. రిలీజ్ రోజు ఓ మోస్తారు ఓపెనింగ్ తెచ్చుకున్న ఈ సినిమా రోజు రోజు కి పబ్లిక్ టాక్ తో వేగంగా దూసుకెళ్ళింది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అక్కడ అలవోకగా 1 మిలియన్ దాటేసిన ఈ సినిమా ఫైనల్ గా మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.

అయితే ఈ ప్రేమకథకి హను రాఘవపూడి ముందుగా కొందరు హీరోలను అనుకున్నారని కానీ ఫైనల్ గా దుల్కర్ చేతికి ప్రాజెక్ట్ వెళ్లిందని ఓ రూమర్ ఉంది. దానిపై లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు హను. సీతారామం కథను ముందుగా నాని , విజయ్ దేవరకొండ , రామ్ లకు చెప్పారట నిజమేనా ? అనే ప్రశ్నకు సమాధానంగా అవన్నీ అవాస్తవాలే అంటూ కొట్టి పారేశాడు. నాని తో రెండో ప్రపంచ యుద్ధం కథతో సినిమా అనుకున్నానని కచ్చితంగా అది చేస్తానని చెప్పుకున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ ను కూడా కలిశానని కానీ అది కూడా వేరే కథ కోసమని తెలిపాడు.

Director Hanu Raghavapudi Exclusive Interview | Sita Ramam | Teravenuka Kathalu | Rajesh Manne

ఇక రామ్ తో తను ‘చాణుక్య’ అనే కథతో సినిమా అనుకున్నాని కానే అది కుదరలేదని చెప్పాడు. ఇక దుల్కర్ చాయిస్ ఎవరు ? అంటే టక్కున చెప్పలేనని అది కలెక్టివ్ డిసిషన్ అని అన్నాడు. ఇంకా ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు హను రాఘవపూడి.