వడ్డీ ఎంతైనా ఓకే… సినిమా అమ్మేది లేదంతే!

Uppena

సినిమా థియేటర్లు ఆగష్టులో తిరిగి ఓపెన్ అవుతాయనే నమ్మకం లేదింకా. దసరా టైంకు మొదలైతే గొప్ప అనేస్తున్నారంతా. చాలా మంది నిర్మాతలు డిసెంబర్, సంక్రాంతి రిలీజ్ పైన దృష్టి పెడుతున్నారు. పూర్తయిన సినిమాలకు వడ్డీ పెరిగిపోతోంది. అయినా కానీ కొందరు నిర్మాతలు థియేటర్లలో విడుదల చేయాల్సిందే అని పట్టుబట్టారు.

ఉప్పెన సినిమా హక్కుల కోసం రీసెంట్ గా మూడు ఓటిటి కంపెనీలు ఎంక్వయిరీ చేసాయి. ఎన్నాళ్లయినా, ఎంత వడ్డీ పెరిగినా థియేటర్లోనే సినిమా రిలీజ్ అవుతుందని మైత్రి మూవీస్ తేల్చేసిందట. ఈ చిత్రం పైన ఇప్పటికే పాతిక కోట్ల లెక్క తేలిందట. అంత మొత్తం ఈ రేంజ్ సినిమాకు ఓటిటి ద్వారా వచ్చే అవకాశమే లేదు.

థియేట్రికల్ గా ఈ చిత్రం సంచలనం అవుతుందని నిర్మాతల నమ్మకం. అందుకే ఆ స్థాయిలో ఖర్చు పెట్టేసారు. కరోనా వారి ప్రణాళిక పాడు చేసినా కానీ మంచి సీజన్లో రిలీజ్ చేస్తే సినిమాకు ఢోకా ఉండదని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఒక అయిదారు కోట్ల అదనపు భారం పడిన పర్వాలేదని భావిస్తున్నారు.